అన్వేషించండి

YSR Congress MPs : రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్నాం - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ప్రకటన !

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రకటించారు. కేంద్రం పట్టించుకోకపోయినా రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు.


YSR Congress MPs :  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రకటించారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ మోహన్ రెడ్  శంఖుస్థాపన చేస్తున్నారని..  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రామాయపట్నం పోర్టుకు సీఎం శ్రీకారం చట్టారని తెలిపారు.  974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి   ఎంతో ప్రతిష్టాత్మకంగా పోర్టుల నిర్మాణం చేపట్టారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు.  మొత్తం 14 పోర్టులు నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని గుర్తు చేశారు. 

కేంద్రం పట్టించుకోకపోయినా రామాయపట్నం పోర్టుకు జగన్ శంకుస్థాపన

 ఏపీ పునర్విభజన చట్టంలో దుగ్గరాజుపట్నం పోర్టును పొందుపరిచినా, ఆ పోర్టు నిర్మాణానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో, రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అనేకమార్లు పార్లమెంటు లోపల, బయటా కోరాం. చివరికి కేంద్రం చేపట్టకపోయినా, రామాయపట్నం పోర్టు కూడా ఆలస్యమౌతున్నందువల్ల, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ఈ పోర్టును  ఏపీ ప్రభుత్వమే చేపట్టిందన్నారు.  దాదాపు రూ. 5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు.  ఈ పోర్టు వస్తే..  ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ మాగుంట తెలిపారు.  

రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం వినిపిస్తున్నాం 

పోర్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఫిషింగ్ హార్బర్లు  ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా మేమంతా మా గళాన్ని వినిపిస్తున్నాం. రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపించాంమన్నారు.  వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదించాలని కోరారు.   టూరిజం అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు పంపాం. సింహాచలం, అంతర్వేది, అన్నవరం దేవాలయాలను టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని  కోరాం. అలానే,  రాష్ట్రంలో ఉన్న ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలి. కొత్తగా జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాల్లో కూడా ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయాలని ప్రెస్ మీట్‌లో వంగా గీత విజ్ఞప్తి చేశారు. 

పోలవరం పై వివాదం సరి కాదు !

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) - కేంద్రం సమన్వయంతోనే జరుగుతుందని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో మూడు ప్రధాన పోర్టులు రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించామన్నారు.  వీటికి సంబంధించి ల్యాండ్ యాక్విజేషన్, పర్యావరణ అనుమతులు, పునరావాసం.. పూర్తి చేస్తున్నాం. మొట్టమొదట రామాయపట్నం పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకువచ్చామని తెలిపారు.  రూ. 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది,  వచ్చే రెండేళ్ళలో  పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.   రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget