అన్వేషించండి

YV Subba Reddy: ఒంటరిగా వచ్చినా, గుంపులతో వచ్చినా జరిగేది అదే - జమిలీ ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

YV Subba Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

YV Subba Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న, సీఎం జగన్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు తిరిగి సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. 

ఇక పోటీ విషయం గురించి వైవీ మాట్లాడుతూ సీఎం జగన్ నేరుగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన పోటీ విషయం గురించి మాట్లాడుతూ ఎక్కడ పోటీచేయాలో నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. మాజీమంత్రి బాలినేనిపై కుట్రల గురించి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదన్నారు. బాలినేనిపై కుట్రలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆయన తన కుటుంబ సభ్యుడని అన్నారు. కుట్రలు చేయాలనే ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తనవంతుగా నిర్వర్తించుకుంటూ వెళ్తున్నట్టు వివరించారు. 

చంద్రబాబు ఐటీ నోటీసులపైనా స్పందన

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంపై వైవీ స్పందించారు. ఏమి చేయకుండా ఊరికే ఐటీ నోటీసులు రావు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమంగా నిధులు వచ్చాయని నిర్ధారణ అయ్యాకే ఐటీ సమన్లు ఇస్తారని పేర్కొన్నారు. తాను నిజాయితీపరుడిని అని చెప్పుకునే ఐటీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన అవినీతికి నిదర్శనాలే ఐటీ నోటీసులని పేర్కొ్న్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు కమీషన్లు, వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు. పవన్ ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అన్నారు. 

ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రధానిని కలిసిన ప్రతీసారీ సీఎం జగన్ ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి స్పష్టమైన మెజారిటీ రాకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఏపీ ఎంపీ సీట్లు కీలకం అవుతాయాన్నారు. అప్పుడు కచ్చితంగా హోదా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో త్వరలో బయటకు వస్తుందన్నారు. దొంగ ఓట్లు లేకపోతే టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు భయమన్నారు. 

చంద్రబాబుకు ఎన్నికలను నేరుగా ఎదుర్కొనడం రాదని, ప్రతిసారీ ఎవరో ఒకరి బలంతోనే సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబుకు సొంత బలం లేదన్నారు. లోకేష్ పాదయాత్రకు స్పందన లేదని, ఉనికి కాపాడుకోవడానికి పాదయాత్ర పేరుతో టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  సీఎంని నోటికొచ్చినట్లు దుర్బాషలాడటం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిస్టానం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఎలా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసునన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ చచ్చిపోయిందన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget