అన్వేషించండి

YSR Internal Politics : పార్లమెంటరీ పార్టీ పదవులన్నీ ఒక వర్గానికే - వైసీపీ అధినేత సామాజికన్యాయాన్ని వదిలేశారా ?

Andhra Politics : వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ముగ్గురూ ఒకే వర్గానికి చెందిన వారిని నియమించారు. సామాజిక న్యాయం గురించి చెప్పే జగన్ ఇలాంటి నియామకాలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

YSRCP News :  వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి,  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఇతర ఎంపీలు ఉన్నా రెడ్డి వర్గానికే ప్రాధాన్యం                             

వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ. నలుగురు బీసీ నేతల్లో  ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు వంటి సీనియర్లు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇతర సామాజికవర్గాల వారి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ముగ్గురు తమకు సన్నిహితులైన రెడ్డి సామాజికవర్గం వారికే పదవుల కట్టబెట్టారు. 

వైవీ సుబ్బారెడ్డికి పార్లమెెంటరీ పార్టీ అధ్యక్ష పదవి                    

అందులోనూ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించడం మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే రాజ్యసభ పక్ష నేతగా ఉండేవారు. మిధన్ రెడ్డి లోక్ సభ పక్ష నేతగా ఉండేవారు. ఈ సారి విజయసాయిరెడ్డి ప్రాధాన్యాన్ని తగ్గించి వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డినే ఢిల్లీలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. వైసీపీ తరపున అవసరమైన లాబీయింగ్‌లను ఆయన ఢిల్లీలో చేస్తూంటారు. అయితే ఈ సారి మాత్రం వైవీ సుబ్బారెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. 

సీనియర్ బీసీ నేతలకు నిరాశే                                          

జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశామని ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే పార్టీ పరమైన నిర్ణయాలు, పదవుల విషయంలో మాత్రం ఆయన కే వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవుల్లో ఇతర కులాల వారిని ఎందుకు కూర్చోబెట్టరన్న ప్రశ్నలు వస్తున్నాయి.అయినా  జగన్ ఈ సారి కూడా మూడు పార్లమెంటరీ పార్టీ పదవుల్ని ఒకే వర్గానికి కేటాయించారు. దీనిపై వైసీపీలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితి ఉండదు కానీ..  జగన్ చెప్పే సామాజిక న్యాయం అంతా మాటల్లోనేనని విపక్షాలు విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది.      

టాప్ హెడ్ లైన్స్

Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget