Jamili elections YSRCP : మూడేళ్లలోనే జమిలీ ఎన్నికలు - వైసీపీ ఆశలు - అవకాశం ఉందా ?
Andhra Pradesh : వైసీపీ జమిలీ ఎన్నికలపై ఎక్కువగా మాట్లాడుతోంది. 2027లోనే ఎన్నికలు వస్తాయని రెడీ కావాలని జగన్ పిలుపునిస్తున్నారు. అలాంటి అవకాశం ఉందా ?
![Jamili elections YSRCP : మూడేళ్లలోనే జమిలీ ఎన్నికలు - వైసీపీ ఆశలు - అవకాశం ఉందా ? YCP is preparing that Jamili elections will come within three years Jamili elections YSRCP : మూడేళ్లలోనే జమిలీ ఎన్నికలు - వైసీపీ ఆశలు - అవకాశం ఉందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/22/948cd34c909823873f8f39f1e1892e481729611677511228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YCP is preparing that Jamili elections will come within three years : సంక్రాంతి వరకూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయాలనుకోలేదని కానీ జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయి కాబట్టి రాజకీయ కార్యకలాపాలు పెంచక తప్పడం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. జమిలీ ఎన్నికల గురించి వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం ఇదే మొదటి సారి కాదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ జమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అది మన చేతుల్లో లేదు కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ కావాలని పిలుపునిచ్చారు. అంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుంటోందని అనుకోవచ్చు.
జమిలీ ఎన్నికలపై పట్టుదలగా కేంద్రం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ కూడా చేసే అవకాశం ఉంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది బీజేపీ విధానం. ఈ విషయంలో బీజేపీ ముందేకే వెళ్తుంది. అంటే జమిలీ ఎన్నికలు ఖాయం అనుకోవచ్చు. కానీ ముందే జమిలీ ఎన్నికలు వస్తాయన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రం తమ పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఒకే సారి జమిలీ ఎన్నికలు పెట్టడం కష్టం అయితే.. వచ్చే సారి పాక్షిక జమిలీ.. ఆ తర్వాత పూర్తి స్థాయి జమిలీ పెడతారు ఎలా చూసినా.. కేంద్రం తన పదవి కాలాన్ని మాత్రం తగ్గించుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు.
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఏపీలో ఇటీవల జరిగినవి జమిలీ ఎన్నికలే !
వైసీపీ జమిలీ ఎన్నికలపై ఎంత తొందర పడుతున్నప్పటికీ.. ఇటీవల ఏపీలో జరిగినవి జమిలీ ఎన్నికలే. అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగాయి. దేశం మొత్తం జమిలీ ఎన్నికలు వచ్చినా పెద్దగా మార్పు ఉండదు. ఇక్కడ ఎప్పుడు జరుగుతాయన్నదే కీలకం. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఓ తేదీ అనుకుని ఆ తేదీ కన్నా ముందు పదవీ కాలం ముగిసిపోయే రాష్ట్రాల పదవీ కాలం పెంచాలి. తర్వాత పదవీ కాలం అయిపోయే వారి పదవీ కాలం తగ్గించాలి. ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేస్తారు. ఏ తేదీ అనుకుంటారంటే..సహజంగా.. పార్లమెంట్ ఎన్నికలు జరిగే తేదీనే అనుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కాస్త ముందుగా ఐదు రాష్ట్రాలు..ఆ తర్వాత మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అలా అన్నింటినీ కలిపితే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కలసి వస్తాయి. అంటే.. కేంద్రం పదవీ కాలం తగ్గించకోవాల్సిన అవసరం ఉండదు.
5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్ షో
2027 జమిలీ ఎన్నికలు వైసీపీ ఊహే !
జమిలీ ఎన్నికలు ఖాయమే అయినా ముందస్తుగా వస్తాయన్నది మాత్రం వైసీపీ ఊహేనని రాజకీయవర్గాలు సులువుగానే అంచనా వేస్తున్నాయి. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్ తో పాటు వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఏపీలో కొన్ని కీలక రాజకీయ పరిణామాలు చోటు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు వైసీపీ ఇలాంటి నమ్మకం పెట్టుకుంటోందని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)