అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: స్టాలిన్‌కు ఆయుధంగా దొరికిన డీలిమిటేషన్ - సెంటిమెంట్‌తో క్లీన్ స్వీప్ చేస్తారా?

Stalin: డిలిమిటేషన్ అస్త్రంతో తమిళ సెంటిమెంట్ తో స్టాలిన్ కొత్త రాజకీయం చేస్తున్నారు. గట్టి పోటీ ఎదుర్కొంటున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో స్టాలిన్ కు డీలిమిటేషన్ అస్త్రం దొరికినట్లయింది.

Delimitation weapon For Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేవలం ఒక పరిపాలనాపరమైన మార్పుగా కాకుండా,  తమిళ ఆత్మగౌరవ  పోరాటంగా మార్చడంలో ఆయన విజయం సాధిస్తున్నారు.  

గట్టి పోటీ ఎదుర్కొంటున్న స్టాలిన్ 
  
తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ గళం  ఎప్పుడూ బలంగానే వినిపిస్తుంది. అయితే, రాబోయే ఎన్నికల్లో అధికార వ్యతిరేకతను అధిగమించి, గట్టి పోటీని ఇస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని దెబ్బకొట్టేందుకు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్  డిలిమిటేషన్  అంశాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికిన  పెరిగితే తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా, ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఒక భావోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

రాజకీయ వ్యూహం- తమిళనాడు ఏకీకరణ 

తమిళనాడును రాజకీయంగా ఏకం చేస్తానని ప్రకటించడం ద్వారా స్టాలిన్ తన ప్రత్యర్థులకు కఠిన సవాలు విసిరారు. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన తమిళనాడుకు, సీట్ల పెంపు ప్రక్రియలో అన్యాయం జరగడం అంటే తమిళ జాతిని అవమానించడమేనన్న వాదనను ఆయన తెరపైకి తెచ్చారు. ఈ అంశం ద్వారా అన్నాడీఎంకే,  బీజేపీలను రక్షణలో పడేశారు.  స్టాలిన్ ఈ పోరాటాన్ని కేవలం సీట్ల పెంపుగా చూడటం లేదు. దీనిని  ద్రవిడ నమూనా అభివృద్ధి పై కేంద్రం చేస్తున్న దాడిగా చిత్రీకరిస్తున్నారు. ఆర్థికంగా దేశానికి ఎంతో మేలు చేస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మేధావుల వరకు అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ గనుక ఎన్నికల నాటికి పతాక స్థాయికి చేరితే, డీఎంకేకు తిరుగులేని మెజార్టీ దక్కడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 భావోద్వేగ రాజకీయం 

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారం  పతాక స్థాయికి చేరింది. ధరల పెరుగుదల, పాలనాపరమైన విమర్శలను ప్రజలు పట్టించుకోకుండా చేయడంలో  భాషా, ప్రాంతీయ సెంటిమెంట్ ఎప్పుడూ కీలకంగా పనిచేస్తుంది. స్టాలిన్ సరిగ్గా అదే పాయింట్‌ను పట్టుకున్నారు. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలో, ఇప్పుడు  డిలిమిటేషన్ వ్యతిరేక ఉద్యమం  ద్వారా యువతను, సామాన్య ప్రజలను ఏకం చేస్తున్నారు. ఇది అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఒక రకమైన రాజకీయ ఇరకాటంగా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవైనప్పటికీ.. తమిళ ప్రయోజనాల పరిరక్షకుడు  అనే ఇమేజ్ స్టాలిన్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. కేంద్రంపై పోరాడే వీరుడిగా తనను తాను ఆవిష్కరించుకోవడం ద్వారా, ఆయన ఓటర్లలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం  తమిళనాడు అగైనస్ట్ డిలిమిటేషన్  అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటం స్టాలిన్ వ్యూహం ఏ స్థాయిలో పని చేస్తోందో తెలియజేస్తోంది.

అభివృద్ధి అజెండా కంటే ప్రాంతీయ ఆత్మగౌరవమే ఎన్నికల ఫలితాలను శాసిస్తుందని భావిస్తున్న స్టాలిన్, తన వ్యూహాలతో మళ్ళీ కోటపై జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ  డిలిమిటేషన్ పాలిటిక్స్  తమిళనాడు ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
YSRCP North Andhra Crisis: ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget