అన్వేషించండి

Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక

Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి తుది హెచ్చరిక జారీ చేశారు. మహా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Stalin announces agitation if Delimitation Bill is passed: నియోజకవర్గాల పునర్విభజన  అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాలను పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తున్న తరుణంలో, స్టాలిన్ దీనిపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.  

స్టాలిన్ తుది హెచ్చరిక 

ముఖ్యమంత్రి స్టాలిన్ తన తాజా వీడియో సందేశంలో కేంద్ర ప్రభుత్వానికి  తుది హెచ్చరి ఇచ్చారు. కేవలం జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇది కేవలం బెదిరింపు కాదు.. తమిళనాడు ఎన్నడూ చూడని రీతిలో ఒక మహా ఉద్యమాన్ని చూస్తారు. ప్రతి కుటుంబం వీధిలోకి వస్తుంది, రాష్ట్రం మొత్తం స్తంభిస్తుంది  అని ఆయన ఘాటుగా హెచ్చరించారు. 1950, 60లలో హిందీ వ్యతిరేక ఉద్యమాల సమయంలో డీఎంకే చూపిన ఉధృతిని మరోసారి దేశం చూస్తుందని ఆయన సంకేతాలిచ్చారు.

జనాభా నియంత్రణకు  శిక్ష వేస్తారా?

తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి జనాభాను నియంత్రించాయని, ఇప్పుడు జనాభా తక్కువగా ఉందని పార్లమెంట్‌లో సీట్లు తగ్గించడం అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమేనని స్టాలిన్ వాదిస్తున్నారు. జనాభా పెంచుకున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిపై దాడి అని, దక్షిణాదిని రాజకీయంగా బలహీనపరిచే కుట్రని స్టాలిన్ అంటున్నారు. 

ఇండియా కూటమి విధానం సామాజిక న్యాయం

ఇండియా కూటమిలో కీలక సభ్యుడైన స్టాలిన్, ఈ విషయంలో కూటమి యొక్క గొంతుకగా మారారు. డిలిమిటేషన్ అనేది కేవలం అంకెల గారడీ  కాకూడదని, అది రాజకీయ సమానత్వం కల్పించేలా ఉండాలని కూటమి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన  హైబ్రీడ్ మోడల్ జనాభాతో పాటు జిఎస్‌డిపి - GSDPని పరిగణనలోకి తీసుకోవడం పై కూటమిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని కూటమి స్పష్టం చేసింది.

 మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని పునర్విభజన చేస్తున్నారని విమర్శలు

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే డిలిమిటేషన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పడాన్ని స్టాలిన్ తప్పుబడుతున్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆ పేరుతో దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటాను తగ్గించే ప్రయత్నాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మహిళా కోటాను నియోజకవర్గాల పెంపుతో సంబంధం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

దేశవ్యాప్త ప్రచారం 

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన,  స్టాలిన్ హెచ్చరికలతో ఈ డిలిమిటేషన్ అంశం కేవలం తమిళనాడుకు పరిమితం కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సమస్యగా మారుతోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక నేతలతో స్టాలిన్ సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం ఏకపక్షంగా ముందడుగు వేస్తే, ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అనే భావన దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రమాదం ఉందని   ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.           

టాప్ హెడ్ లైన్స్

Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget