అన్వేషించండి

Top Warning Signs Your Car Battery: కారు బ్యాటరీ డెడ్ అయ్యే ముందు వచ్చే సంకేతాలు - నిర్లక్ష్యం చేస్తే నడిరోడ్డుపై ఇబ్బందే!

కారు బ్యాటరీ విఫలమయ్యే ముందు కనిపించే కీలక లక్షణాలను గుర్తించడం ద్వారా మధ్య దారిలో వాహనం ఆగిపోకుండా జాగ్రత్త పడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

Car Battery Tips: వాహన యజమానులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కారు బ్యాటరీ విఫలం కావడం ఒకటి. చాలా సందర్భాల్లో బ్యాటరీ పూర్తిగా పని చేయడం ఆగిపోయే ముందే కొన్ని హెచ్చరికల‌ సంకేతాలను ఇస్తుంది. సాధారణంగా ఆధునిక బ్యాటరీలు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు మన్నికగా వస్తాయి. అయితే, వాతావరణ పరిస్థితులు, మనం కారును నడిపే విధానం, ఎలక్ట్రికల్ పరికరాల వాడకం వంటి కారణాల వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గే అవకాశం ఉంటుంది. కారు బ్యాటరీ మార్చాల్సిన సమయం వచ్చిందని తెలిపే ఆ ముఖ్యమైన గుర్తులు ఇప్పుడు చూద్దాం.

ఇంజన్ స్టార్ట్ అవ్వడంలో జాప్యం..
బ్యాటరీ బలహీనపడటానికి మొదటి సంకేతం స్లో ఇంజన్ క్రాంక్. మీరు ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ కావడానికి గతంలో కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంటే, బ్యాటరీ నుండి స్టార్టర్ మోటార్‌కు తగినంత పవర్ అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి కారు వెంటనే స్టార్ట్ అయ్యి, మరోసారి మొరాయిస్తుంటే బ్యాటరీ సామర్థ్యం క్షీణించిందని గుర్తించాలి. ఇటువంటి సమయంలో బ్యాటరీని టెస్ట్ చేయించడం ఉత్తమం.

ఎలక్ట్రికల్ సమస్యలు - హెడ్ లైట్స్..
బ్యాటరీ వోల్టేజ్ అవుట్‌పుట్ తక్కువగా ఉన్నప్పుడు కారులోని ఎలక్ట్రికల్ పరికరాలు సరిగ్గా పని చేయవు. హెడ్ లైట్లు డిమ్ గా వెలగడం, క్యాబిన్ లైట్లు మినుకుమినుకు మనడం, పవర్ విండోస్ చాలా నెమ్మదిగా మూసుకోవడం వంటివి జరిగితే బ్యాటరీ బలహీనపడిందని ఫిక్స్ అవ్వచ్చు. నేటి ఆధునిక కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, డిజిటల్ డిస్‌ప్లేలు ఎక్కువగా ఉండటం వల్ల స్థిరమైన విద్యుత్ సరఫరా చాలా అవసరం. డాష్‌బోర్డ్ మీద బ్యాటరీ సింబల్ వెలుగుతున్నా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది బ్యాటరీ లేదా ఆల్టర్నేటర్ సమస్యను సూచిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

లీకేజీ ప్రాబ్లం..
బ్యాటరీ టెర్మినల్స్ వద్ద తుప్పు పట్టడం (Corrosion) వల్ల విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. దీనిని క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంటే బ్యాటరీ లీకేజీ అయ్యే అవకాశం ఉంది. అలాగే, కారు లోపల కుళ్ళిన కోడిగుడ్ల వంటి వాసన వస్తుంటే అది సల్ఫ్యూరిక్ యాసిడ్ లీకేజీకి సంకేతం. అధిక వేడి వల్ల బ్యాటరీ కేసింగ్ ఉబ్బిపోవడం లేదా పగుళ్లు రావడం వంటివి జరిగితే వెంటనే మార్చేయాలి. లేదంటే అది కారులోని ఇతర భాగాలను దెబ్బతీస్తుంది అని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

3 సంవత్స‌రాలకు ఒక‌సారి..
ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేయించడం మంచి అలవాటు. బ్యాటరీపై ఉండే తయారీ తేదీని బట్టి అది ఎంత పాతదో తెలుసుకోవచ్చు. సీజన్ మారే ముందే బ్యాటరీ హెల్త్ ని తనిఖీ చేయించుకుంటే హఠాత్తుగా కారు ఆగిపోయే ప్రమాదం తప్పుతుంది. సమయానికి బ్యాటరీ మార్చడం వల్ల ఆల్టర్నేటర్ మీద కూడా భారం తగ్గుతుంది. కారు సర్వీసింగ్ చేయించేటప్పుడు బ్యాటరీ టెర్మినల్స్ క్లీన్ చేయించడం, వోల్టేజ్ లెవల్స్ చూడటం వల్ల వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉంటుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

టాటా టియాగో EV BAAS అంటే ఏంటి? తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు.. బ్యాటరీకి నెలనెలా చెల్లింపులు!
Tata Tiago EV కొనాలంటే బ్యాటరీకి భారీ ఖర్చు అక్కర్లేదు.. BAAS మోడల్ ఫుల్‌ డిటైల్స్‌
టయోటా గ్లాంజాను సొంతం చేసుకోవాలని ఉందా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర & తక్కువ EMI డిటైల్స్ ఇప్పుడే తెలుసుకోండి
కేవలం రూ.1.60 లక్షలకే Toyota Glanza మీ ఇంటికొస్తుంది! 4 ఏళ్ల నుంచి 7 ఏళ్ల EMI ప్లాన్స్ ఇవే!
మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త ఎలక్ట్రిక్‌ కార్‌ Pixo.. ఒక్క ఛార్జ్‌తో 259 కి.మీ. ప్రయాణం, ఇంకా చాలా ప్రత్యేకతలు
Nissan Pixo.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 259 కిలోమీటర్లు.. చిన్న EVలోనే అదిరిపోయే ఫీచర్లు!
యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!
20 ఏళ్లుగా రోడ్లపై Hyundai Verna హవా.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో మార్పులు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Shooting Gold Glory:  షూటింగ్ లో భారత జోడీకి గోల్డ్ మెడ‌ల్.. కొరియాకు చుక్కలు చూపించి చాంపియ‌న్ గా నిలిచిన క‌మ‌ల్ ఇత్, ఇంద‌ర్ సింగ్ జంట‌
షూటింగ్ లో భారత జోడీకి గోల్డ్ మెడ‌ల్.. కొరియాకు చుక్కలు చూపించి చాంపియ‌న్ గా నిలిచిన క‌మ‌ల్ ఇత్, ఇంద‌ర్ సింగ్ జంట‌
Smapoornesh Babu : సినిమాల్లోకి ఎందుకొచ్చావ్... ఎందుకంత దురద? - సంపూర్ణేశ్ బాబుకు క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సారీ చెప్పిన సీనియర్ జర్నలిస్ట్
సినిమాల్లోకి ఎందుకొచ్చావ్... ఎందుకంత దురద? - సంపూర్ణేశ్ బాబుకు క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సారీ చెప్పిన సీనియర్ జర్నలిస్ట్
Liquor shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
Brazil Nuts : రోజూ బ్రెజిల్ నట్స్ తింటే శరీరంలో ఈ మార్పులు వస్తాయట.. థైరాయిడ్‌ నుంచి గుండె ఆరోగ్యం వరకు
రోజూ బ్రెజిల్ నట్స్ తింటే శరీరంలో ఈ మార్పులు వస్తాయట.. థైరాయిడ్‌ నుంచి గుండె ఆరోగ్యం వరకు
22A Land Issue Solved: 22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!
20 ఏళ్లుగా రోడ్లపై Hyundai Verna హవా.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో మార్పులు
6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా ఉన్నా అతి తక్కువ ధర!.. టయోటా గ్లాంజా ఎందుకంత స్పెషల్?
టయోటా కార్లలో ఇదే చీపెస్ట్.. రూ.6.73 లక్షలకే.. ఫీచర్లు, సేఫ్టీలోనూ బెటర్‌!
Embed widget