అన్వేషించండి

Pawan Vs YSRCP : జనసేనానిపై వైఎస్ఆర్‌సీపీ నేతలది ఫ్రస్ట్రేషనా ? బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక దాడా ?

పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ అంత తీవ్రంగా ఎందుకు విరుచుకుపడుతోంది. ప్రత్యేకమైన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారా ?

 

Pawan Vs YSRCP :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటున్నాయి. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ చాలా దారుణంగా దాడి చేస్తోంది. చంద్రబాబుకు దగ్గరవుతున్నారని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారనేదానికి  ఒక్కో ఘటన చోటు చేసుకున్నప్పుడు ఈ దాడి మరింత తీవ్రంగా జరుగుతోంది. అయితే ఈ దాడి రాజకీయ అంశాలపై కాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతూండటం..  అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అందుకుంటూడటంతో .. అసలు వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యూహం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. 

పవన్ పై ఎటాక్ తో ప్రజల్లో సానుభూతి  పెరిగే చాన్స్ 

పవన్ కల్యాణ్ పై ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న విమర్శలు చాలా దారుణంగా ఉంటున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి అయినంత మాత్రాన అంత దారుణంగా విమర్శిస్తారా అన్న అభిప్రాయం సామాన్యుల్లో వస్తోంది. ఇంతకూ పవన్ ఏం చేశారంటే..  టీడీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇతర పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ.. పొత్తు పెట్టుకుంటున్నారని ఇలా వ్యక్తిగత  హననానికి పాల్పడటం మాత్రం రాజకీయాల్లో కొత్త ధోరణే. ఈ కారణంగా పవన్ కల్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అదే తరహాలో విమర్శిస్తున్నారు. ఈ కారణంగా పవన్  కు ప్రజల్లో సానుభూతి  పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వైఎస్ఆర్‌సీపీకి తెలియదా అంటే...తెలియదని.. అంచనా వేయలేదని అనుకోలేం. 

టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఇబ్బందని  పవన్ ను రెచ్చగొడుతున్నారా ?

దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయ్..  మీ సామాజికవర్గం ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తూంటే.. చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయనను సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నావని వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కు చాలెంజ్ చేస్తున్నారు. అందుకే పవన్ చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చారు. తన వెనుక తన సామాజికవర్గం లేకపోయినా పర్వా లేదని ప్రకటించారు. కులాల ఐక్యత అంటే.. అన్ని  కులాలను కలుపుకుని పోవడమేనంటున్నారు. నిజానికి వైసీపీ నేతలు ఆయనను ఓ కులానికి పరిమితం చేయడానికో.. లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయడానికో ఈ విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ అధికారానికి ఇబ్బంది ఎదురవుతుందని ఫ్రస్ట్రేషన్ కు గురి కావడమేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.పవన్ ఒంటరిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలి వైసీపీ సునాయాసంగా  గెలుస్తుందని వారి ప్లాన్ కావొచ్చంటున్నారు. 

పవన్ ను వ్యూహాత్మకంగా బలపర్చే ప్రయత్నం చేస్తున్నారా ?

పవన్ కు అత్యధిక ప్రయారిటీ ఇచ్చి విమర్శలు చేయడం వెనకు వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేక వ్యూహం ఉందంటున్నారు. ఆయనను బలపర్చడం వల్ల కూడా మేలు జరుగుతుందని.. ఆ పార్టీ వ్యూహకర్తల అభిప్రాయం కావొచ్చంటున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరాలంటే సీట్ల మధ్య ఓ అవగాహనకు రావాలి. తనకు బలముందని.. తనకు క్రేజ్ పెరిగిందని పార్టీకి ఆదరణ పెరిగిందని జనసేన అనుకుంటే టీడీపీని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయవచ్చు. అప్పుడు రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయి. చివరికి పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సాఫీగా సాగదని ప్లాన్ కావొచ్చంటున్నారు. మొత్తంగా వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ అత్యంత వ్యూహాత్మకంగా ఉందని..  మాత్రం రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

KCR Assembly Attendance: సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారు! — కేటీఆర్ ప్రకటన వెనుక ఆత్మవిశ్వాసమా? కాంగ్రెస్‌కు దొరికిన పొలిటికల్ అస్త్రామా?
సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారు! — కేటీఆర్ ప్రకటన వెనుక ఆత్మవిశ్వాసమా? కాంగ్రెస్‌కు దొరికిన పొలిటికల్ అస్త్రామా?
Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
Konda Surekha: ఇక కాంగ్రెస్‌లో కొండా దంపతుల మనుగడ అసాధ్యమే - బీజేపీ వైపే చూపులా!
ఇక కాంగ్రెస్‌లో కొండా దంపతుల మనుగడ అసాధ్యమే - బీజేపీ వైపే చూపులా!
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Embed widget