అన్వేషించండి

Kavitha Bail Politics : కవిత బెయిల్ చుట్టూ రాజకీయం - కేటీఆర్ హడావుడే ఈ పరిస్థితికి కారణమా ?

Telangana ; కవిత బెయిల్ వెనుక పొలిటికల్ డీల్ ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇలా చర్చ జరగడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన హడావుడే కారణం అన్న విమర్శలు వస్తున్నాయి.

Is Political Deal Behind Kavitha bail  :  భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదలయ్యారు. మార్చి  పదిహేనో తేదీ నుంచి ఆమె  తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు అంతా  పూర్తి చేశామని కోర్టుకు చెప్పాయి. ఇక ట్రయల్ ఉంది. ట్రయల్ కు ముందే జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని బావించిన  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు మనీష్ సిసోడియాకూ బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్‌కి కూడా ఇదే గ్రౌండ్స్ పై బెయిల్ వస్తుందని న్యాయనిపుణుల అంచనా. అయితే కవితకు వచ్చిన బెయిల్ పై తెలంగాణలో మత్రం భిన్నమైనరాజకీయ చర్చ నడుస్తోంది. పొలిటికల్ డీల్ కారణంగానే ఈ బెయిల్ వచ్చిందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

బండి సంజయ్ ఆరోపణలతో కలకలం

కవితకు బెయిల్ మంజూరైన కొద్ది సేపటికే  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ట్వీట్ పెట్టారు. కవితకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు తెలంగాణ నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వినే కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదించారని దీన్ని బట్టి కాంగ్రెస్,  బీఆర్ఎస్ మధ్య పరస్పర అవగాహనతో ఉన్నాయని అర్థమవుతుందని ఆయన ఆరోపించారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిబద్ధతను  ప్రశ్నించేలా .. బండి సంజయ్ తీరు ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టును కోరుతూ ట్వీట్ చేశారు. నిజానికి బండి సంజయ్ కొంత కాలంగా కవితకు బెయిల్ కాంగ్రెస్సే ఇప్పిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనికి కారణం.. బీజేపీతో బీఆర్ఎస్ పొలిటికల్ డీల్ చేసుకోవడం వల్లే కవితకు  బెయిల్ వస్తోందన్న ప్రచారం ఉద్ధృంగా సాగడమే. 

అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!

పొలిటికల్ డీలేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్ 

మరో వైపు కవిత  బెయిల్ కోసం రెండు, మూడు సార్లు ఢిల్లీలో పర్యటించిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా  బీఆర్ఎస్,  బీజేపీ మధ్య డీల్ కుదిరిందని అందుకే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రె్స పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇదే ఆరోపణలను బలంగా చేశారు. కేటీఆర్ రెండు రోజుల నుంచి  బెయిల్ వస్తుందని హడావుడి చేస్తున్నారని నాలుగురోజుల నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితకు బెయిల్ వచ్చినట్లేనని చెబతోందని గుర్త చేశారు. తీర్ప చదివే వరకూ కోర్టులో ఉన్న వారికి కూడా తెలియదని కానీ సుప్రీంకోర్టు తీర్పులను.. బీఆర్ఎస్ ముందే చెప్పేస్తోందని ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదే తరహా ఆరోపణల్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. 

బుల్లెట్లు దిగవు కానీ బుల్డోజర్లు దిగుతాయి - హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫాతిమా ఓవైసీ కాలేజీనే !

కేటీఆర్ ఢిల్లీ టూర్లు.. బెయిల్ పై చేసిన వ్యాఖ్యలే కారణం !

కవిత జైలుకు వెళ్లిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెల్లారు. ఈ సందర్భంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు లేదా విలీనాలపై చర్చలు జరిగాయని  జోరుగా ప్రచారం సాగింది. వాటిని బీఆర్ఎస్ బలంగా ఖండించలేదు. అదే సమయంలో కవితకు బెయిల్ ప్రాసెస్ లో వస్తుందని తదుపరి విచారణలో బెయిల్ వస్తుందని కేటీఆర్ బలంగా చెబుతూ వస్తున్నారు. ఇదంతా ఢిల్లీ చర్చల మహిమేనని ఇతర పార్టీలు ప్రచారం చేయడానికి ఇదో కారణంగా మారింది. నిజానికి కవిత ఐదున్నర నెలల వరకూ బెయిల్లో ఉన్నారు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు కూడా పూర్తయినందున సాక్షుల్ని ప్రభావితం చేయడం.. దర్యాప్తును ప్రభావితం చేయడం అన్న సమస్య ఉండదు కాబట్టి నిందితుకు బెయిల్ ఇస్తారని న్యాయవర్గాలు అంచనా వేశాయి.  కానీ కేటీఆర్ చేసిన ప్రకటనలు.. ఢిల్లీ చర్చల పుకార్ల వల్ల.. కవిత బెయిల్ వెనుక పొలిటికల్ డీల్ ఉందన్న ప్రచారం జరగడానికి కారణం అయిందని అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Ganesh Immersion: వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Ganesh Immersion: వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
Singer Mano Sons: సింగర్ మనోకు షాక్, ఇద్దరు కొడుకులు అరెస్ట్
సింగర్ మనోకు షాక్, ఇద్దరు కొడుకులు అరెస్ట్
MAD Square First Look: ‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్‌ లుక్‌ అదిరిందంతే!
‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్‌ లుక్‌ అదిరిందంతే!
Update For Pensioners: సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లకు ఇన్ని బెనిఫిట్సా?,- ప్లీజ్‌మిగతావాళ్లు కుళ్లుకోవద్దు!
సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లకు ఇన్ని బెనిఫిట్సా?,- ప్లీజ్‌మిగతావాళ్లు కుళ్లుకోవద్దు!
Zimbabwe Elephants: ప్రజలకు ఏనుగు మాంసం పంపిణీ - ఏకంగా 200 ఏనుగుల్ని చంపేస్తున్న ప్రభుత్వం!
ప్రజలకు ఏనుగు మాంసం పంపిణీ - ఏకంగా 200 ఏనుగుల్ని చంపేస్తున్న ప్రభుత్వం!
Embed widget