![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HYDRAA Owaisi College : బుల్లెట్లు దిగవు కానీ బుల్డోజర్లు దిగుతాయి - హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫాతిమా ఓవైసీ కాలేజీనే !
Fatima Owaisi College : బండ్లగూడ చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చడానికి హైడ్రా ఏర్పాట్లు చేసుకుంది.. ఆ భవనాల్లో 70 శాతం కబ్జా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
![HYDRAA Owaisi College : బుల్లెట్లు దిగవు కానీ బుల్డోజర్లు దిగుతాయి - హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫాతిమా ఓవైసీ కాలేజీనే ! HYDRA has arranged to demolish Fatima Owaisi College built on Bandlaguda pond HYDRAA Owaisi College : బుల్లెట్లు దిగవు కానీ బుల్డోజర్లు దిగుతాయి - హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫాతిమా ఓవైసీ కాలేజీనే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/27/cebc9092a28315c393e876fc8568faa51724757375626228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HYDRAA has arranged to demolish Fatima Owaisi College built on Bandlaguda pond : కూల్చివేతలతో దడ పుట్టిస్తున్న హైడ్రా తన తదుపరి టార్గెట్ బండ్ల గూడ సలకం చెరువును కబ్జా బారి నుంచి కాపాడటమేననిసంకేతాలు పంపుతోంది. ఈ చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా ఓవైసీ కాలేజీని నిర్మించారు. ఇక్కడ తాము పేదలకు చదువు చెబుతున్నామని ఈ కాలేజీల జోలికి రావొద్దని ఓవైసీ అంటున్నారు. కానీ హైడ్రా అధికారులు ఆక్రమణ.. ఆక్రమణనేనని స్పష్టం చేస్తున్నారు. బండ్లగూడ చెరువులో దాదాపుగా అతి పెద్దభవనాలు పన్నెండు నిర్మించారు. వీటిలో కాలేజీని నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చెరువులోనే ఓవైసీ కాలేజీలు
కానీ ఫుల్ ట్యాంక్ లెవర్, బఫర్ జోన్లే కాదు.. పూర్తిగా చెరువునేకబ్జా చేసి ఈ భవనాలు నిర్మించారు. మ్యాపుల్లో ఈ అంశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని వర్గాల నుంచి ఈ కాలేజీని పడగొట్టాలన్న డిమాండ్ వస్తోంది. దీంతో హైడ్రా అధికారులు కూల్చివేతకు రంగం సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడు రోజుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. తన కార్యాలయంలోనే వివిధ శాఖల అధికారులతో సమావేశమై పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. ఓ టీమును పంపి.. భవనాలను పరిశీలించి నివేదిక తెప్పించున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పడు ప్రారంభించినా గంటల్లోనే పూర్తియపోయేలా .. సన్నాహాలు చేసుకుంటున్నారని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి.
కూల్చివేతకు ఏర్పాట్లు చేసుకుంటున్న హైడ్రా అధికారులు
మరో వైపు కూల్చివేతను అడ్డుకునేందుకు ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ పార్టీ క్యాడర్ తీవ్రంగా శ్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూల్చివేతల సమయంలో భారీ ఉద్రిక్తత ఏర్పడుతుందన్న కారణంగా అదనపు బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ తనపై బుల్లెట్లతో కాల్చాలి కానీ.. తన కాలేజీలో జోలికి రావొద్దని ఆయన అంటున్నారు. కానీ బుల్లెట్లతో కాదు బుల్ డోజర్లతో వస్తామని హైడ్రా అధికారులు సవాల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మజ్లిస్ పార్టీ రేవంత్ తో సన్నిహితంగా ఉంటోంది. ఈ కారణంగా ఆ కట్టడాలను పట్టించుకోరని అనుకున్నారు.
మజ్లిస్ తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం - ఉద్రిక్తలు ఖాయమా ?
కానీ చెరువుల్ని కాపాడకపోతే తనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చనట్లేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. తన మిత్రులైనా.. స్నేహితులైనా.. ఎవరైనా చెరువును కబ్జా చేసినట్లుగా ఉంటే వదిలి పెట్టేది లేదన్నారు. పూర్తిగా కూల్చి వేస్తామన్నారు. అయితే ఓవైసీ బ్రదర్స్ వేరే. వారి ఆస్తుల జోలికి వస్తే ఊరుకోర. ఇప్పుడు.. చెరువును ఆక్రమించి కట్టిన వ్యవహారంలో.. హైడ్రా కూల్చివేతలు ప్రారంభిస్తే.. ఓవైసీ సోదరులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)