Karimnagar అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!
కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది.
Karimnagar News | సామాన్యంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పరిమితికి మించి రోజులు సెలవు పెట్టాలనుకున్న దేశం దాటాలనుకున్న జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నియమ నిబంధనలు ఒక్కో రంగంలో ఒక్కోరకంగా ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా నిత్యవసర పరిస్థితుల్లో పై అధికారుల వద్ద నుండి పర్మిషన్ తీసుకొని సెలవును పెట్టుకుంటారు అలాంటిది ఒక నగరానికి ప్రధమ పౌరుడిగా పిలువబడే నగర మేయర్ కనీస సమాచారం లేకుండా దేశాన్ని దాటారు. నేను మేయర్ ని "ఐ డోంట్ కేర్" ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు అనుకున్నారో ఏమో ఏకంగా దేశాన్ని దాటారు కరీంనగర్ నగర మేయర్ ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాలకు
కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నెల 23న అమెరికాలోని డల్లాస్కు వెళ్లిన నగర సునీల్ రావు అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా దేశం దాటడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీస బాధ్యత లేకుండా ఇన్చార్జి కూడా ఇవ్వకుండా అమెరికాకి వెళ్లారంటూ విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. అయితే ఇదే విషయంపై నగర మేయర్ సునీల్ రావు పై జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తికి దరఖాస్తు ఇచ్చారు నగర డిప్యూటీ మేయర్ . స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే నగర మేయర్ సునీల్ రావు కి వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
నిర్ణీత గడువులోగా రాకపోతే చర్యలు
అయితే నగర మేయర్ సునీల్ రావు మాత్రం తాను వచ్చేనెల 6 తారీకు కరీంనగర్కు వస్తానని కలెక్టర్ బదులుగా చెప్పినట్టు సమాచారం. కలెక్టర్ ఇచ్చిన మెమో గడువు ప్రకారం తేదీ లోపల రానట్లయితే తెలంగాణ మున్సిపల్ ఆక్ట్ 2019 సెక్షన్ 34(2) ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ మెమోలో పేర్కొన్నారు. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం 15 రోజులు మించి నగరం వదిలిపెట్టిన దేశం దాటిపెట్టి వెళ్లాలన్న జిల్లా కలెక్టర్ కి మున్సిపల్ కమిషనర్ కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అయినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఈ నిబంధనలో ఉల్లంఘించారు.
గత ప్రభుత్వం అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్
రాష్ట్రంలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టేందుకైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాదులో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కరీంనగర్లో బిఆర్ఎస్ నాయకులను వరుసగా అరెస్టు కూడా చేశారు. అయితే ఈ సమయంలోనే నగరమే సునీల్ రావు ఎందుకు అమెరికాకు వెళ్లారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి...?