KCR Strategy On Kavitha : కవిత విషయంలో అంటీముట్టనట్లుగా కేసీఆర్ రాజకీయం - కుమార్తె కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
KavitHa Case : కవిత కేసు విషయంలో కేసీఆర్ అరెస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకూ ఇంకా చెప్పాలంటే రిలీజ్ తర్వాత కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇలా ఉండటం వెనుక కేసీఆర్ బలమైన రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.
KCR : రాజకీయ చాణక్యుడు కేసీఆర్. ఆయన ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే కవిత కేసు, ఆమె అరెస్టు విషయంలో చాలా లో ప్రోఫైల్ పాటించారు కేసీఆర్. ఇప్పుడు కవిత అరెస్టు వరకూ గుంభనంగా ఉన్నారు. కనీసం ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా ఆమెను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లలేదు. అంతే కాదు.. ఆ కేసు గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు కూడా. వీలైనంత వరకూ తన కుమార్తె జైల్లో ఉందన్న సంగతి తనకు తెలియన్నట్లుగా వ్యవహరించారు. ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ అంతర్గత సమావేశఆల్లో మాత్రం తాను రగిలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని చెప్పారు. నిజంగా ఆయన అలాగే ఉంటారని .. కానీ ఆవేశ పడకుండా..రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు.
లిక్కర్ కేసుకు ప్రాధాన్యం దక్కకుండా వ్యూహం
కవితపై లిక్కర్ కేసు ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమని ప్రజల్లోకి వెళ్లేలా చేసేందుకు కేసీఆర్ పక్కా వ్యూహంతోనే కుమార్తె విషయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ సైలంట్ గా ఉండటానికి కారణం తన సమయం వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంభించడమేనని అంటున్నారు. మీడియా అంతా కవితపై నెగిటీవ్ మాట్లాడుతున్నా... కేసీఆర్ ఒక్క మాట ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా అది ఆ కేసు విషయంలో మరింత విస్తృతమైన చర్చకు కారణం అవుతుంది. ఓ మీడియా సమావేశంలోనే కడిగిన ముత్యంలా తన కూతురు వస్తుందని కామెంట్ చేశారు. ఆ తర్వాత కవిత కేసు విషయంలో ఎక్కడా మాట్లాడలేదు.
కవిత బెయిల్ పై బీజేపీ, కాంగ్రెస్ ల పొలిటికల్ వార్ వెనుక కథ ఇదేనా?
ఒక్క సారి కూడా పరామర్శకు ఢిల్లీ వెళ్లని కేసీఆర్
ఐదున్నప నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు. కానీ ఒక్క సారి కూడా పరామర్శించలేదు. తను వెళ్లడం వల్ల జాతీయ స్థాయిలో మీడియా నెగిటీవ్ గా ప్రోజెక్ట్ చేస్తుందని... ఈ కేసుకు ప్రాధాన్యత పెరుగుతుందన్న కారణంగా ఆగిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. బీజేపీతో కలవడానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉందని.. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఢిల్లీ వెళ్లలేదని చెబుతున్నారు. లకేటీఆర్ మాత్రమే కాకుండా హరీశ్ రావును అక్కడి పంపి కేటీఆర్ కూడా బీజేపీతో చర్చలు అన్న ప్రచారం జరగకుండా హరీశ్ రావును తోడుగా పంపారని భావిస్తున్నారు. కవిత విడుదల తర్వాత అంతా కవిత మీద ఉన్న నెగిటీవ్ ప్రచారం వెనక్కు పోయేలా డిజైన్ చేశారు. నిన్న విడుదల అంతా మీడియాలో వచ్చేలా చూశారని ఇదంతా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. హైదరాాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇది కూడా రాజకీయ కేసులో బయటకు వచ్చారన్న అభిప్రాయాన్ని కల్పించడానికేనని భావిస్తున్నారు.
Also Read: Kavitha Bail: కవిత, కనిమొళిల జైలు జీవితం ఒకేలా ఉందా ? ఈ సారూప్యతలు గమనించారా ?
కవిత వేధింపులకు గురయ్యారన్న సానుభూతి కలిగేలా ప్రచారం
తన కూతురు ఇమేజ్ పెరిగేలా ఎయిర్ పోర్టు నుండి భారీగా స్వాగత సత్కారాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. కవిత రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా బెయిల్ నుండి వచ్చిన కవిత కవరేజి మీడియాలో వచ్చేలా పక్కా ప్లానింగ్ తో వ్యవహరించారు. సాయింత్రం ఇంటి వద్ద కవితను కలవకుండా జాగ్రత్తలు. తాను వస్తే మీడియా అంతా కవితను వదిలి.. తనపో ఫోకస్ చేస్తారని కేసీఆర్ కు తెలుసు. అందుకే రాకుండా ఉన్నారు.గురువారం ఫాం హౌస్ లో కలవడం మరో రోజు మీడియాలో ప్రముఖ వార్త అవుతుందని కవిత తప్ప ఎక్కడా ఈ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు లు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వ్యూహంలో భాగమే. తాను మాట్లాడకుండా కవిత తోనే మాట్లాడించడం ఇమేజ్ ను క్రియేట్ చేయడంలో భాగమని అంటున్నారు. మొత్తగా కేసీఆర్ కవిత జైలు జీవితం పునాదులుగా మంచి రాజకీయ జీవితాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేసినట్లుగా అర్తం చేసుకోవచ్చంటున్నారు.