అన్వేషించండి

Kavitha Bail: కవిత బెయిల్ పై బీజేపీ, కాంగ్రెస్ ల పొలిటికల్ వార్ వెనుక కథ ఇదేనా?

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రాగానే కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవడం వెనుక మతలబేంటి. కోర్టులను అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయా.

Kavitha Bail News | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై  రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి.  కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. అయితే  ఈ రాజకీయ విమర్శల దాడుల వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శలు ఇవే..
గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి బీజేపీ అధినాయకత్వం తప్పించిందని ప్రచారం చేసింది. బీజేపీతో బంధం ఉన్నందుకే కవిత అరెస్ట్ కావడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే  ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ తరుణంలో కూడా కవిత అరెస్ట్ కాకపోవడానికి బీజేపీతో ఉన్న బంధమే కారణమన్న విమర్శలు కాంగ్రెస్ నేతలు గుప్పించారు. మార్చి నెలలో కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతి పరిణామాలు తెలిసిందే. 

గత కొద్ది రోజుల నుండి మాత్రం త్వరలోనే కవితకు బెయిల్ వస్తుందని ఈ మేరకు  ఒప్పందం కుదుర్చుకోవడానికే కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారని హస్తం నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుందని ప్రచారం మొదలు పెట్టారు.  దీన్ని ఇరువురు గులాబీ నేతలు ఖండించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే బెయిల్ రావడంతో బీజేపీతో ఒప్పందం కుదరడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని తాజాగా కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టింది. 16 నెలలు జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకు,  ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రశ్నల ద్వారా బీజేపీతో మైత్రి కుదిరిందన్న వార్తలు వాస్తవం అన్న రీతిలో అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరగడానికి బీఆర్ఎస్ త్యాగం చేసినందుకే కవిత బయటకు వచ్చిందని కవిత బెయిల్ వెనుక  ఉన్న మతలబు ఇదేనంటూ రేవంత్ రెడ్డి సూత్రీకరించారు.

ఎదురుదాడికి దిగిన బీజేపీ... 
కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శలను బీజేపీ  సైతం దీటుగా సమాధానం ఇస్తోంది. లిక్కర్ కేసులో సుధీర్ఘ కాలం జైల్లో కవితను పెట్టింది మేం అయితే ఆమెకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ న్యాయవాదుల బృందమే అని కమలం నేతలు ఎదురుదాడికి దిగారు.    కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే  కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ - కాంగ్రెస్ ల సంయుక్త విజయంగా అభివర్ణించారు. కవిత కేసు ను వాదించిన అడ్వకేట్ ను రాజ్యసభకు పంపడం అనే ఒప్పంద వల్లే కవితకు బెయిల్ సాకారమయిందని ఆరోపణ చేశారు. ఇలా కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై పరస్పర రాజకీయ యుద్ధానికి దిగడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది.
Also Read: Kavitha Bail: కవిత, కనిమొళిల జైలు జీవితం ఒకేలా ఉందా ? ఈ సారూప్యతలు గమనించారా ?

బీఆర్ఎస్ భుజంపై తుపాకీ పెట్టి.....

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక రాజకీయపార్టీలుగా ఉన్నవి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు. అయితే ఎన్నికల ముందు  బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే రీతిలో రెండు పార్టీలు  పని చేశాయి. సైద్ధాంతికంగా కలవకపోయినా ఒకే లక్ష్యంతో పని చేశాయి.  బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు బీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి  ఒకరినొకరు దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్నాయి.  ఇందుకు కవిత బెయిల్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందే రీతిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఓట్లు,సీట్లే ఆ పార్టీ బలాబలాలను నిర్దేశిస్తాయి కాబట్టి  అయితే   ఈ వ్యూహాత్మక పోరాటంలో ఏ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందో తెలియాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకేనా…?
కవిత బెయిల్ విషయంలో రెండు పార్టీలు పరస్పర  రాజకీయ విమర్శలు చేసుకుంటున్నా... మధ్యలో బీఆర్ఎస్ ను రాజకీయంగా డామేజ్ చేసే విషయంలో మాత్రం రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయనే చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్  తిరిగి పుంజుకోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా  దెబ్బ తీసేందుకు బీజేపీతో మైత్రీ ఉందని విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో కాలమే సమాధానం చెబుతుంది.   ఈ ప్రచారం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి తమతో కలిసేలా చేయాలన్న ఆలోచన ఈ ప్రచారం వెనుక దాగి ఉందనడంలో సందేహం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తే ఆ పార్టీ మరింత బలహీనపడి కనుమరుగు అవుతుందన్నఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు.  

ఐదేళ్ల పాటు అధికారంలో లేకుండా పార్టీని నడపడం సాధ్యం కాని పని అని ఈ విషయంలో కేసీఆర్ ను దెబ్బకొడితే ఆ పార్టీ పునాదులు కదులుతాయన్న వ్యూహంతో రేవంత్ రెడ్డి ఈ తరహా ప్రచారంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే ఎప్పటి నుండో దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్న కమలం నేతలకు తెలంగాణలో ఇప్పుడు ఉన్న  రాజకీయ వాతావరణం మంచి  అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీలో మరింత ఆశలు రేపాయనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్  కు మద్ధతిచ్చే వర్గాలను తమ వైపు తిప్పుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను  దెబ్బకొట్టేందుకు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం అవుతుందన్న యోచనలో బీజేపీ వర్గాలు ఉన్నాయి. ఈ కారణంతో బీఆర్ఎస్ ను ఎంత బలహీనం చేస్తే ఆ స్థానంలో కమలం పార్టీ తో భర్తీ చేద్దామన్న వ్యూహం వారిది.

బీఆర్ఎస్ వ్యూహాలేంటి..?
అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీల వ్యూహాలు తెలిసినా. పదేళ్ల పాటు ఒంటి చేత్తో తెలంగాణ రాజకీయాలను శాసించిన  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు మౌనంగా ఉండటం  తప్ప  ఇప్పటికిప్పుడు చేసేదేం లేని పరిస్థితి నెలకొంది.  తన కుమార్తె కవితకు బెయిల్ రావడం వ్యక్తిగతంగాను, రాజకీయంగాను కేసీఆర్ కు కొంత ఊరటనిచ్చే విషయం. పార్టీ పరంగా చూస్తే  వచ్చే ఎన్నికల నాటి వరకు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తన ముందు ఉన్న పెద్ద టాస్క్. ప్రస్తుతం తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను  కాపాడుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారన్నది వేచి చూడాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టెక్నికల్ గా అనర్హత వేటు పడేలా న్యాయస్థానాల ద్వారా విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి.  ఇక మరో పెద్ద టాస్క్  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్  గెలుపు. ఇందు  కోసం కేసీఆర్ ఏం చేస్తారు అన్నది మరో ప్రశ్న. పార్టీ పటిష్టతకు, పార్టీ కమిటీల నిర్మాణం, పార్టీ బాధ్యతల పంపిణీ వంటి అంశాలు ప్రాధాన్యమైనవే. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీని అంటిపెట్టుకునేలా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో అన్నది కూడా కేసీఆర్ ముందున్న సమస్యలే. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం అయ్యేలా ఎలాంటి రోడ్ మ్యాప్ తయారు చేస్తారు.

అటు బీజేపీ- ఇటు కాంగ్రెస్ పార్టీల వ్యూహాలను ఎదుర్కొని రాష్ట్రంలో మరో దఫా చక్రం తిప్పుతారా లేదా అన్నది కూడా బీఆర్ఎస్ చీఫ్ ముందున్న ప్రశ్నలే. అన్ని చక్కగా కుదిరినప్పుడు ఏ సమస్య అయినా సుళువుగానే పరిష్కారం అవుతుంది. రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనప్పుడే పార్టీ అధినాయకుడు ఆ వాతవరణం తమకు ఏలా అనుకూలంగా మార్చుకుంటారు అన్నదే.. నాయకుడి సంబంధించిన  నాయకత్వ లక్షణాలను బయపెడుతోంది. ఉద్యమ రాజకీయాలతో పాటు,  అధికార పీఠంలో పదేళ్లు ఉన్న కేసీఆర్ కు ఇవేమి తెలియనవి కావు.  ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలతో కేసీఆర్  ముందుకు సాగుతారో చూడాల్సిందే.  

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళనతో 2 గంటల వరకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget