అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ - డీఎంకే కంచుకోటలో దళపతి సాహసం!

TVK Vijay: విజయ్ తన రాజకీయ అరంగేట్రం కోసం ఎంచుకోబోయే నియోజకవర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అది డీఎంకే కంచుకోట.

Vijay to contest from Perambur:  తమిళ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా  తమిళగ వెట్రి కళగం   అధినేత, సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ అరంగేట్రం కోసం ఎంచుకోబోయే నియోజకవర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెన్నైలోని  పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నిర్ణయం విజయ్ రాజకీయ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్  అవుతుందా లేక  వ్యూహాత్మక తప్పిదం గా మిగిలిపోతుందా  అన్నదానిపై భిన్నాభిప్రాయాలుఉన్నాయి. 

 డీఎంకే కంచుకోటలో సవాల్ 

పెరంబూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా డీఎంకే పార్టీకి పెట్టని కోట. 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ సుమారు  55 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 52% పైగా డీఎంకే ఖాతాలోకే వెళ్లాయి. ఇంతటి బలమైన పట్టున్న నియోజకవర్గాన్ని విజయ్ ఎంచుకోవడం కచ్చితంగా ఒక సాహసమే. ఇక్కడ గెలుపు ద్వారా తాను డీఎంకేకు అసలైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలన్నది విజయ్ వ్యూహం కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో డీఎంకే క్యాడర్‌ను ఢీకొట్టడం అంత సులభం కాదు.

 నగర ఓటర్లు vs సినిమా క్రేజ్ 

సాధారణంగా నగరాల్లోని విద్యావంతులు, మధ్యతరగతి ఓటర్లు కేవలం సినిమా గ్లామర్‌ను చూసి ఓట్లు వేయరనే వాదన ఉంది. విజయ్‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత మాస్ ఫాలోయింగ్ చెన్నై వంటి మెట్రో సిటీల్లో ఓట్లుగా మారుతుందా అన్నది సందేహమే. గతంలో కమల్ హాసన్ వంటి వారు కూడా నగరాల్లో పోటీ చేసి చేదు అనుభవాలను చవిచూశారు. విజయ్ తన బలాన్ని గ్రామీణ లేదా సెమీ-అర్బన్ నియోజకవర్గాల్లో  మధురాంతకం లేదా తిరుచ్చి వంటి చోట్ల పరీక్షించుకుంటే రిస్క్ తక్కువగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టగలరా? 

పెరంబూర్ నియోజకవర్గంలో కార్మిక వర్గం, మురికివాడల ప్రజలు ఎక్కువగా ఉంటారు. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, ముఖ్యంగా నిరుద్యోగం , ధరల పెరుగుదల వంటి అంశాలను విజయ్ తన వైపు తిప్పుకోగలిగితేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ టీవీకే సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నా, అది ఓట్లుగా మారుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఇక్కడ ఫలితం తేడా వస్తే, కొత్తగా పెట్టిన పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

 డీఎంకే వ్యూహం - విజయ్‌కు గండం 

విజయ్ రాజకీయాల్లోకి రావడం డీఎంకేకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆయన ఎక్కడ పోటీ చేసినా అక్కడ సర్వశక్తులు ఒడ్డి ఓడించాలని అధికార పార్టీ కంకణం కట్టుకుంది. డీఎంకే తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా, విజయ్ ఫ్యాన్ బేస్‌లో చీలిక తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యువత ఓట్లు రెండుగా చీలితే అది పరోక్షంగా డీఎంకేకే లాభిస్తుంది.  విజయ్ కేవలం తన అభిమాన సంఘాలపైనే ఆధారపడకుండా, పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

పెరంబూర్ వంటి కఠినమైన స్థానాన్ని ఎంచుకోవడం ద్వారా విజయ్ తన ధైర్యాన్ని చాటుకుంటున్నారు. అయితే, రాజకీయాల్లో ధైర్యం కంటే వ్యూహం ముఖ్యం. ఆయన కేవలం  సినిమా స్టార్  గానే మిగిలిపోతారా లేక రాజకీయ శక్తి గా ఎదుగుతారా అనేది పెరంబూర్ తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 23, 2026న జరగబోయే ఈ పోరు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. 


 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget