అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?

Udhayanidhi: డీఎంకే తరపున స్టాలిన్ బాధ్యతల్ని ఉదయనిధినే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి.. ప్రచార బాధ్యతల వరకూ ఆయనే చూసుకుంటున్నారు.

Udhayanidhi Stalin takes charge of DMK in Tamil Nadu Assembly elections:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ద్రావిడ మున్నేట్ర కజగం  ప్రచార పర్వంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వ్యూహకర్తగా, పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండగా.. ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ క్షేత్రస్థాయిలో పార్టీకి అసలైన ప్రచార సైన్యాధ్యక్షుడి గా అవతరించారు.  

ఉదయనిధి స్టాలిన్   వన్‌మెన్ షో

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉదయనిధి స్టాలిన్ పేరే వినిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరంలో డీఎంకే కూటమిని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ఆయన తన భుజానికెత్తుకున్నారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేవలం ప్రధాన బహిరంగ సభలకు, విధానపరమైన నిర్ణయాలకు పరిమితమవుతుండగా.. ఉదయనిధి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ, రోడ్ షోలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, పార్టీపై తనదైన ముద్ర వేసేందుకు ఈ ఎన్నికలను ఆయన ఒక గొప్ప అవకాశంగా మలచుకుంటున్నారు.

 క్షేత్రస్థాయిలో దూకుడు - యువతకు గాలం 

ఉదయనిధి కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే కాకుండా, పార్టీ ఎన్నికల వ్యూహరచనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు వరకు అన్నింటా ఆయన ప్రమేయం కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. గత ఎన్నికల్లో  ఇటుక ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరును ఇప్పుడు కూడా కొనసాగిస్తూ, తన ప్రసంగాల్లో వాడిని పెంచుతున్నారు. డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఆయనకు ఉన్న పట్టు ఇప్పుడు పార్టీకి ప్రధాన బలంగా మారింది.

 వ్యూహాత్మక మౌనం - స్టాలిన్ మార్గదర్శకత్వం 

ముఖ్యమంత్రి స్టాలిన్ ఈసారి చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన ఎక్కువగా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడటంపై దృష్టి సారించారు. ప్రచార బాధ్యతలను పూర్తిగా ఉదయనిధికి అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ఆయనను తన వారసుడిగా ప్రజలు ఆమోదించేలా  గ్రౌండ్ ప్రిపేర్  చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే స్టాలిన్ కేవలం జిల్లా కేంద్రాల్లో జరిగే భారీ సభలకే వెళ్తుండగా, ఉదయనిధి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.

 విజయ్ పార్టీ రూపంలో కొత్త సవాల్

ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం  ఈ సారి ఎన్నికల బరిలో ఉండటం డీఎంకేకు కొంత ఆందోళన కలిగిస్తోంది. యువత ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉన్నందున ఉదయనిధి స్టాలిన్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వస్తోంది. విజయ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉదయనిధి స్వయంగా పర్యటిస్తూ, ద్రావిడ మోడల్  పాలన ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. బీజేపీ-అన్నాడీఎంకే కూటమిని ఎండగడుతూనే, కొత్తగా వస్తున్న రాజకీయ శక్తులను దీటుగా ఎదుర్కోవడంలో ఆయన ఒంటి చేతులతో ప్రచారాన్ని నడిపిస్తున్నారు. విపక్షాలు ఉదయనిధి ఎదుగుదలను వారసత్వ రాజకీయం అని విమర్శిస్తున్నా, ఆయన మాత్రం తన పనితీరుతో సమాధానం ఇస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుపోతూనే, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ ఎన్నికలు కేవలం డీఎంకే మనుగడకే కాదు, ఉదయనిధి స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా అగ్నిపరీక్ష లాంటివి. ఒకవేళ డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే, పార్టీలో , ప్రభుత్వంలో ఉదయనిధి నంబర్ 2 నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. 


 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget