అన్వేషించండి

Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!

Kerala: కేరళలో బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీకి ఈ సారి మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనాలతో కీలక నేతల్ని ప్రచార బరిలోకి దింపారు. యువనేతలకు ఎన్నికల బాధ్యతలిచ్చారు.

BJP top leaders campaign in Kerala Assembly elections:   కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా  ఢిల్లీ ముఖ్యమంత్రి  రేఖా గుప్తా ఎర్నాకులం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ జిల్లాకు ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.  

కేరళ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, సంప్రదాయ కూటములకు స్వస్తి పలికి ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్  సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. మంగళవారం ఎర్నాకులంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం  ఊపందుకున్న తరుణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి  రేఖా గుప్తా  కేరళ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన వెల్లడించారు.  

దశాబ్దాలుగా కేరళను పాలిస్తున్న యూడీఎఫ్ (UDF), ఎల్డీఎఫ్ (LDF) కూటముల వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని  బీజేపీ నమ్మకంతో ఉంది.   అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ఆ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి వర్గాలు ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి నమూనా పట్ల ఆకర్షితులవుతున్నారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.  

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన పర్యటనలో భాగంగా రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయ్యి, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఉదాహరణగా చూపుతూ, కేరళలోనూ అటువంటి మార్పు సాధ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రేఖా గుప్తా రాకతో పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం వచ్చిందని, ఆమె రాజకీయ వ్యూహాలు కేరళలో కమల వికాసానికి దోహదపడతాయని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కేరళలో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget