అన్వేషించండి

Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?

Shabbir Ali Audio Leak: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనంతటికి కారణం పార్టీలోని వర్గ పోరాటమేనని చెప్పాల్సిన పని లేదు.

Meenakshi Natarajan Rajya Sabha Controversy:  తెలంగాణ కాంగ్రెస్‌లో 'కయ్యాల సంస్కృతి' మరోసారి బహిర్గతమైంది. అధికారంలోకి వచ్చి పరిపాలన సాగిస్తున్నప్పటికీ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, నేతల మధ్య సమన్వయ లోపం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో రద్దయిన వివాదం సల్లారకముందే.. పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసే మరో సరికొత్త వివాదం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ మహ్మద్ షబ్బీర్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో లీక్ కావడం ఇప్పుడు టీపీసీసీ  లో రేకెత్తిస్తున్న ప్రకంపనలకు అద్దం పడుతోంది.

మహేష్ కుమార్ పై షబ్బీర్ అలీ ఆరోపణలు

దాదాపు మూడు నెలల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ ఆడియో క్లిప్‌లో.. షబ్బీర్ అలీ పార్టీ అంతర్గత పోకడలపై, ముఖ్యంగా ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూస్తున్న పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్  వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని, లూప్‌హోల్స్‌ను వాడుకుంటూ ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా అందులోని వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బు ఇస్తే కొనుక్కోగలిగే పార్టీగా మారిపోయింది  అని దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న ఒక సీనియర్ నేత నోట రావడం కేవలం ఒక వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదు.. పార్టీలో అంతర్గతంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న తీవ్ర అసమ్మతికి ఇది నిదర్శనం.

ఆధిపత్య పోరు కారణంగానే సమస్యలు 

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేస్తూ వ్యతిరేక ప్రచారం మరియు లీక్‌ల పర్వం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక ఆధిపత్య పోరు దాగి ఉందన్నది స్పష్టమవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలతో పాలనలో బిజీగా ఉంటే, మరోవైపు సంస్థాగతంగా పార్టీని నడిపించే పీసీసీ పీఠంపై కొందరు సీనియర్లు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. తమను కాదని వలస వచ్చిన వారికో, లేదా జూనియర్లకో ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన పాత కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఇటువంటి ఆడియో క్లిప్పింగులను అస్త్రాలుగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

మీనాక్షి కేసు సమాచారం తెలంగాణ నుంచే వెల్లిందా? 

ఈ వ్యవహారాని  ముందే జరిగిన మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఉదంతం కూడా ఈ అంతర్గత కుట్రల కోణాన్ని బలపరుస్తోంది. తెలంగాణకు సంబంధించిన ఒక పాత ప్రైవేట్ కోర్టు కేసు వివరాలను మీనాక్షి తన అఫిడవిట్‌లో దాచారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆమె నామినేషన్ రద్దయింది. అయితే, ఇక్కడి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్‌లో పోటీ చేస్తున్న మీనాక్షికి వ్యతిరేకంగా ఆ కోర్టు పత్రాలను, లీగల్ నోటీసులను స్వయంగా తెలంగాణ కాంగ్రెస్‌లోని ఒక వర్గమే శత్రుపక్షానికి చేరవేసిందంటూ బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా బహిరంగంగా వ్యాఖ్యానించారు.  అంటే, సొంత పార్టీ ఇన్‌ఛార్జ్‌ను ఓడించడానికి లేదా దెబ్బతీయడానికి రాష్ట్ర నేతలే వెన్నుపోటు పొడిచారనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది.

హైకమాండ్ పట్టించుకుంటుందా? 

ఈ రెండు పరిణామాలను  కలిపి చూస్తే తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ సాంప్రదాయక బలహీనత అయిన సొంత పార్టీ నేతలే కాళ్లు లాగడం  అనేది అధికారంలో ఉన్నప్పుడు కూడా మారలేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌పై వ్యతిరేక ప్రచారం ఒకవైపు, నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య టికెట్లు, పదవుల లొల్లి మరోవైపు పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తోంది. ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటూ, ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకుని లీక్ చేసే స్థాయికి దిగజారడం పార్టీ క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది.  తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడు బయట ఉన్న విపక్షాల కంటే లోపల ఉన్న 'సొంత శత్రువుల' నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. అధికారంలో ఉన్నాం కదా అనే ధీమాతో అంతర్గత కుమ్ములాటలను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే, అది ప్రభుత్వంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget