TS Congress KCR : కేసీఆర్‌పై రాజద్రోహం కేసులు - పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ ఫిర్యాదులు
రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేసీఆర్‌పై రాజద్రోహం కేసులు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లలోఫిర్యాదులు చేశారు. చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తామని ప్రకటించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు టీ న్యూస్ చానల్ , నమస్తే తెలంగాణ పత్రికలపై రాజద్రోహం కేసులు పెట్టాలని తెలంగాణ వ్యాఫ్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను టీ న్యూస్ మీడియా సమర్థిస్తూ కథనాలురాసి రాజ్యాంగాన్ని మరింత అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిపిస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు వెళ్లి అక్కడి పోలీస్ స్టేషన్‌లో స్వయంగా ఫిర్యాదు చేశారు.
ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం, చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..
భారత రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే కేసీఆర్ భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం క్షమాపణలు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం సాగుతుందని ప్రకటించారు. అంతర్జాతీయ దేశ ద్రోహుల కంటే కేసీఆర్ ప్రమాదకరమైన వ్యక్తంటూ విమర్శించారు. దళితులు అంటే కేసీఆర్‌కు పూర్తి వివక్ష అని మండిపడ్డారు.15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను ముఖ్యమంత్రి నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
నాకు చావంటే భయం లేదు.. Z కేటగిరీ భద్రత అవసరం లేదు: ఓవైసీ
రేవంత్ తో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఫిర్యాదులు ఇచ్చారు. పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు కానీ కేసులు నమోదు చేసే అవకాశం లేదు. అయితే తాము ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యాప్తంగా అవిశ్రాంత పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న కేసీఆర్ దాని వల్ల ప్రయోజనం లేదనడం రాజ్యాంగాన్ని కించ పరుస్తున్నారని కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు.
టీఎస్ఆర్టీసీ షాక్! స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు, ఈ రూట్‌లో మాత్రమే..
కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే చర్చ కన్నా రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దీక్షలు చేసింది. కేసులు పెట్టింది. క్షమాపణలు చెప్పే వరకూ పోరాడతామని ప్రకటించింది.