అన్వేషించండి

Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ

Cash Reward For Dating In China: ఒక చైనీస్ కంపెనీ, ఆన్‌లైన్‌ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విజయవంతంగా ఒక పార్ట్‌నర్‌ను వెతుక్కుంటే, తన ఉద్యోగులకు క్యాష్‌ రివార్డ్‌ అందిస్తోంది.

Chinese Firm Announced Dating Reward For Employees : సాధారణంగా, అన్ని కంపెనీలు తన ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాయి. తలెత్తకుండా, టైమ్‌ వేస్ట్‌ చేయకుండా, పక్కవాళ్లతో మాట్లాడకుండా పని చేయాలని చెబుతుంటాయి. ఒక చైనీస్ కెమెరా కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ప్రేమించడాన్ని (డేటింగ్‌) ఎంకరేజ్‌ చేస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా డేటింగ్‌ చేస్తున్నవారికి నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. ఆ కంపెనీ పేరు ఇన్‌స్టా360 (Insta360). మన పొరుగు దేశం చైనాలోని 'షెంజెన్‌' నగరంలో ఉంది. 

ప్రేమిస్తే డబ్బే డబ్బు
ఇన్‌స్టా360 కంపెనీ, ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన ప్రతి విజయవంతమైన పోస్ట్‌కు ఒక్కో ఉద్యోగికి 66 యువాన్లను (సుమారు రూ.750) బహుమతిగా ఇస్తోంది. అయితే, చైనీస్‌ డేటింగ్‌ ఫాట్‌ఫామ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఒక ఉద్యోగి చైనీస్‌ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తనకు సరైన పార్ట్‌నర్‌ను కనిపెట్టి, వారితో కనీసం మూడు నెలల పాటు ప్రేమాయణం నడిపితే, ఆ ఇద్దరితో పాటు మ్యాచ్ మేకర్‌కు కూడా తలో 1,000 యువాన్లు రివార్డుగా ఇస్తామని కంపెనీ ఘనంగా ప్రకటించింది.

కంపెనీ ఉద్దేశం ఏంటి?
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, డేటింగ్ ఫోరమ్ ద్వారా ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ చర్య ద్వారా ఉద్యోగుల్లో 'కుటుంబ భావన & ఆనందాన్ని' పెంచడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

సంస్థ ఈ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 500 పోస్ట్‌లు విజయవంతమయ్యాయి, దాదాపు 10,000 యువాన్లు ఉద్యోగులకు రివార్డ్‌గా దక్కింది. ఈ డబ్బు వారి మ్యాచ్ మేకింగ్ ప్రయత్నాలకు ఉపయోగపడింది. అయితే, ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రారంభించి ఇంకా మూడు నెలల కూడా కాలేదు కాబట్టి, కంపెనీ దీర్ఘకాలిక డేటింగ్ బోనస్‌లను ఇంకా పంపిణీ చేయలేదు.

చైనాలో పరిస్థితి ఇదీ..
జపాన్‌ లాగే చైనాలోనూ ఇటీవలి కాలంలో వివాహాలు, జననాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2023లోని మొదటి మూడు త్రైమాసికాలతో (జనవరి-సెప్టెంబర్‌) పోలిస్తే, 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో వివాహాల సంఖ్య 16.6 శాతం తగ్గిందని అధికారిక రికార్డులు చూపిస్తున్నాయి. ఇదే కాలంలో జననాల రేటు కూడా రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. 2023లో ప్రతి 1,000 మందికి కేవలం 6.39 జననాలు నమోదయ్యాయి, 2022లో ఈ నంబర్‌ 6.77గా ఉంది. ఈ నేపథ్యంలో, దేశంలో వివాహాలు, జననాల రేటును పెంచడానికి ఇన్‌స్టా360 కంపెనీ 'డేటింగ్‌'ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

కంపెనీ తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగులలో మిశ్రమ స్పందన వచ్చింది. "నా కంపెనీ మా అమ్మ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది" అని ఒక ఉద్యోగి సోషల్‌ మీడియాలో రాస్తే; మరొకరు "క్యాష్‌ రివార్డ్‌లు ఇవ్వడం సరైన మార్గమేనా?" అని ప్రశ్నించారు. అంటే, ప్రేమించడానికి డబ్బును ఎరగా వేస్తారా అనే అర్ధంతో ఈ కామెంట్‌ చేశారు. అయితే, సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ వార్తపై భారీగానే ప్రతిస్పందించారు. ఆ కంపెనీ ఉద్యోగులు అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరో ఆసక్తికర కథనం: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం! 

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget