Telangana BJP : ఢిల్లీలో వార్ రూమ్ - తెలంగాణలో నేతల యుద్ధం ! బీజేపీ టార్గెట్ ఫిక్స్ అయినట్లేనా ?
తెలంగాణ బీజేపీ నేతలకు అసలు కమాండ్స్ ఢిల్లీ వార్ రూమ్ నుంచి రానున్నాయి. మొత్తం సీనియర్లను ఎన్నికల బరిలోకి దించాలని హైకమాండ్ నిర్ణయించింది .
Telangana BJP Seniors : భారతీయ జనతా పార్టీలో రెండు రకాల నేతలుంటారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా.. సీనియర్ నేతలుగా చెలామణి అవుతూ ఉంటారు. పెద్దపెద్ద పదవులు కూడా పొందుతూంటారు. కానీ ఈ సారి అలాంటి చాన్స్ ఎవరికీ ఇవ్వకూడదని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ సారి సీనియర్లు అందరూ బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం నియోజకవర్గాల చాయిస్ కూడా వారికే ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ బరిలో అగ్రనేతలు
బీజేపీలో పెద్ద పదవుల్లో ఉన్న తెలంగాణ నేతలంతా అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. కేంద్ర మంత్రి అయినా సరే, ఎంపీలు అయినా సరే జాతీయ స్థాయిలో ఏ హోదాలో ఉన్నవారైనా సరే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనంటూ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 75 టార్గెట్‌ను బీజేపీ పెట్టుకుంది. గెలిచే అవకాశమున్న 75 స్థానాలను గుర్తించడంతోపాటు 50 మంది కీలక నేతలను గుర్తించి ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని హైకమాండ్ ాదేశించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు రాజకీయం ఎలా చేయాలి.. ప్రజలకు ఎలా చేరువ కావాలో ఓ ప్రత్యేకమైన టీమ్ బీజేపీ కోసం పని చేస్తోంది. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుంచే జరిగేలా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ్నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఇక్కడ పని చేయాల్సి ఉంటుంది.
కోకాపేట్ భూముల వేలంలో ఆల్ టైం రికార్డ్! రూ.100 కోట్లు దాటిన ఎకరం భూమి రేటు
ఢిల్లీ మానిటరింగ్.. తెలంగాణ రాజకీయాలు
వ్యూహాలు పన్నడంలో బీజేపకి తిరుగు ఉండదు. గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా రాజకీయాలు అసలు చేయరు. తెలంగాణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి.. విశ్లేషించి.. బీజేపీ ముందుకు ఎలా రావాలన్న అంశంపై పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎప్పుడు ఏ అంశంపై స్పందించాలి.. ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్న అంశంపై కూడా దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా తెలంగాణలో బీజేపీ గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ఆయన వ్యక్తిగతంగా తెలంగాణను ఓ లక్ష్యంగా పెట్టుకోవడంతో.. ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. పార్టీలో చేరికల విషయంలోనూ ఆయన ముందు ముందు ప్రత్యేకమైన ఆపరేషన్లు ప్లాన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణ రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం - 44 వేల మంది రైతుల ఖాతాల్లోకి నగదు !
తెలంగాణకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 20 నుంచి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఆయా నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నియోజక వర్గాల్లో వాస్తవ పరిస్థితిని నివేదిక ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వానికి అందజేయనున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ కు చెందిన టీములు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి. అలాగే ప్రచారక్‌లూ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని.. బయట జరిగే ప్రచారానికి.. బీజేపీ చేస్తున్న పనులకు పొంతన ఉండదని ఆ పార్టీ నేతలంటున్నారు.