అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Telangana News : తెలంగాణ రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం - 44 వేల మంది రైతుల ఖాతాల్లోకి నగదు !

రుణమాఫీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు 44,870 మంది రైతుల‌కు రుణమాఫీ చేశారు.

 

Telangana News :  గురువారం నుంచి రుణమాఫీని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగానే అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.  రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరింది.  రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రక‌టించారు.  రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

2014లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను  నిన్నటి వరకూ మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు.  సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది.  తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.                      

అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌  అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ  ర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు.                           

రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ  ) ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు.                                         

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget