News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుసగా నిందితులు అప్రూవర్లుగా మారుతున్నారు. ఎవరిని టార్గెట్ చేసినట్లు ?

FOLLOW US: 
Share:


Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో  నిందితులంతా వరుసగా అప్రూవర్లుగా మారుతున్నారు. తాము ఎలా నేరం చేశామో చెబుతామని క్షమించేయాలని పిటిషన్లు వేస్తున్నారు. ఇలా అప్రూవర్లుగా మారిన వారిలో మొదట దినేష్ అరోరా ఉన్నారు. తర్వాత బుచ్చిబాబు ఉన్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా తాను అప్రూవర్ గా మారిపోతానని పిటిషన్ వేశారు. ఈ మధ్యలో అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా మొత్తం చెప్పేసి.. తర్వాత తన స్టేట్ మెంట్ వెనక్కి తీసుకుంటానని  పిటిషన్ వేశారు. అప్రూవర్లుగా మారడానికి తెర వెనుక చాలా జరుగుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నెలల తరబడి జైల్లో ఉన్న వీరు హఠాత్తుగా ఎందుకు అప్రూవర్లుగా మారుతున్నారన్నది కీలకం. వీరంతా నిజాలు చెప్పి ఆర్థిక లావాదేవీలు,స్కాం గురించి పూర్తిగా బయటపెడితే.. నిండా మునిగేది ఎవరు అన్న చర్చలు కూడా ఈ కారణంగానే  వస్తున్నాయి. 

అప్రూవర్లు ఏం చెబుతారు ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మొదట అప్రూవర్ గా మారింది  దినేష్ అరోరా.   దినేష్ అరోరాను అప్రూవర్‌గా మారినట్లుగా ప్రకటించిన బీజేపీ .. ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టులో పిటిషన్ వేసింది.  ఈ కేసులో మొదట్లో సీబీఐ అరెస్ట్  ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాల్లో దినేష్ అరోరా కీలకపాత్ర పోషించారని సీబీఐ చెబుతోంది. ఆయన అప్రూవర్ గా సాక్ష్యాలు ఇస్తే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిండా మునిగిపోతారని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత విజయ్ నాయర్ కూడా అప్రూవర్ గా మారారు. 
 
సౌత్ లాబీ నుంచి వరుసగా అప్రూవర్లు 

ఇక సౌత్ లాబీ నుంచి వరుసగా ఆప్రూవర్లు వస్తున్నారు.  బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో  దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌రామచంద్రపిళ్లై,బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎవరూ ఊహించని విధంగా  ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ను అప్రూవర్ గా మారినట్లుగా శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టులో మెమో దాఖలు చేశారు. అప్రూవర్ గా మారటానికి తనకు అకాశం కల్పించాలని కోరుతు అభ్యర్థించారు. దానికి ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.  దీంతో కీలక నిందితులు కూడా అప్రూవర్ గా మారడంతో అసలు టార్గెట్ ఇక ఎవరు అన్నచర్చ వినిపిస్తోంది. 

సౌత్ లాబీ నుంచి కవితను టార్గెట్ చేశారా ? 

ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు.అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌,ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  గా కవిత మాజీ ఆడిటర్, సౌత్‌గ్రూప్ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడంతో... బుచ్చిబాబు వెల్లడించే వివరాల ఆధారంగా  కీలక వివరాలు బయట పెడుతున్నారు.  ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు,బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలను ఈడీ ఒక్కోటిగా బయటపెండుతోంది. కవిత కొన్న భూముల వివరాలంటూ కోర్టుకు సమర్పిస్తున్న చార్జిషీట్లలో డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు. 
 ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈకేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. కవితను పక్కాగా ఫ్రేమింగ్ చేయడానికి ఇలా నిందితుల్ని అప్రూవర్లుగా మారుస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. 

Published at : 02 Jun 2023 07:00 AM (IST) Tags: Kavitha Delhi Liquor Scam Kejriwal Rouse Avenue Court Liquor Scam Case ED Delhi Liquor Scam Approvers

ఇవి కూడా చూడండి

Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్

Nitin Gadkari: చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

Nitin Gadkari: చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

Eetala Rajender: నాకు శత్రువులు లేరు, కావాలనే నాపై చెడు రాతలు - ఈటల రాజేందర్

Eetala Rajender: నాకు శత్రువులు లేరు, కావాలనే నాపై చెడు రాతలు - ఈటల రాజేందర్

Madhy Yaski : కాంగ్రెస్‌లో ఎల్బీనగర్ రగడ - మధుయాష్కీకి టిక్కెట్ దక్కేనా ?

Madhy Yaski : కాంగ్రెస్‌లో ఎల్బీనగర్ రగడ - మధుయాష్కీకి టిక్కెట్  దక్కేనా ?

టాప్ స్టోరీస్

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్