అన్వేషించండి

BRS in Revanth trap : బీఆర్ఎస్ పదే పదే రేవంత్ ట్రాప్‌లో పడుతోందా ? కేసీఆర్ పట్టించుకోకపోవడమే కారణమా ?

Telangana: రేవంత్ రెడ్డి ప్లాన్డ్ గా బీఆర్ఎస్‌ను ట్రాప్‌లోకి లాగుతున్నారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. హరీష్ రావుపదే పదే ఈ మాటను పరోక్షంగా చెబుతున్నప్పటికీ ట్రాప్ నుంచి బయటపడలేకపోతున్నారు.

Revanth Reddy is pulling BRS into a trap as planned : ప్రజా సమస్యల నంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి తరచూ ఓ అంశాన్ని హైలెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అలాంటి ప్లాన్లు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉంటే.. ఏం చేయాలి ?. ఆ ట్రాప్‌లో పడకుండా ప్రజా సమస్యలనే  హైలెట్ చేయాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఆ ట్రాప్‌లో పడి వెళ్లిపోతోంది. మళ్లీ రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు  చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దానికి సాక్ష్యం..  కౌశిక్ రెడ్డి - అరికెపూడి గాంధీ వ్యవహారమే. 

పీఏసీ చైర్మన్ గా ఫిరాయింపు నేతకు ఇచ్చి రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా విపక్ష నేతను నియమించడం సంప్రదాయం. ఆ ప్రకారం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కు ఇవ్వాలని దరఖాస్తు వెళ్లింది. అయితే స్పీకర్ మాత్రం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇచ్చారు. ఆయన పార్టీ మారిపోయారని  బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మారలేదని ఆయన అంటున్నారు. నిజానికి సాంకేతికంగా ఆయన పార్టీ మారకపోయినా బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అనధికారికంగా అయినా తమ పార్టీకి అనుబంధం ఉన్న ఎమ్మెల్యేకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్. అధికారికంగా మాత్రం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అక్కడ నిబంధనల ఉల్లంఘన జరగలేదు. కానీ దీన్ని హ్యాండిల్ చేయడంలో బీఆర్ఎస్ చూపించిన  దూకుడుతో రేవంత్ రాజకీయం చేశారు. 

ప్రభుత్వం కన్నా జగన్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్న షర్మిల - కాంగ్రెస్‌వైపు రాకుండా చేసే ప్రయత్నమేనా ?

కౌశిక్ రెడ్డి ఆవేశంతో దారి తప్పిన వ్యూహం

అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడంపై కౌశిక్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. దూకుడైన.. వివాదాస్పద  రాజకీయాలు చేస్తున్న కౌశిక్ రెడ్డి మాట కంటే ముందు ఇతర నేతల ఇళ్లపైకి వెళ్తానని బయలుదేరుతున్నారు. కౌశిక్ రెడ్డి దూకుడును కాంగ్రెస్ పక్కాగా ఉపయోగించుకుంది. ఆయనను మరితంగా రెచ్చగొట్టింది. ఇలాంటి సమయంలోనూ సంయమనం పాటించాల్సిన బీఆర్ఎస్ నేతలు.. మరింత దూకుడుగా వెళ్లి కాంగ్రెస్ పని సులభం చేశారు. ఈ పరిణామాలతో  సెటిలర్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం అయినట్లయింది. అలాగే శాంతిభద్రతల సమస్యను తీసుకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం ద్వారా రేవంత్  రెడ్డి మరో కోణాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇవన్నీ ఆలోచిస్తే.. చాలా డ్యామేజ్ జరుగుతుదంని తెలిసి..బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. గాంధీ కన్నా రేవంత్ నే టార్గెట్ చేస్తూ తర్వాత విమర్శలు చేశారు. కానీ అప్పటికే జరాగల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన ఉంది. 

హీరోయిన్ జెత్వానీ కేసులో అలా ఇర్కుకున్న ఐపీఎస్‌లు - సీరియస్ కేసులు తప్పవా ?

హైడ్రా నుంచి ప్రతి విషయంలోనూ రేవంత్ ప్లాన్ లో బీఆర్ఎస్ భాగం

రేవంత్ రెడ్డి పాలన చేపట్టిన మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావొచ్చు.. హైడ్రా విషయంలో కావొచ్చు.. రుణమాఫీ విషయంలో కావొచ్చు.. బీఆర్ఎస్ ఆవేశపడేలా చేసి.. తన రాజకీయం తాను చేస్తున్నారు. వీటన్నింటిపై బీఆర్ఎస్‌కు అవగాహన ఉంది. రేవంత్ అలా చేస్తున్నారని అంటున్నారు కానీ.. తమను తాము కంట్రోల్ చేసుకోలేక ట్రాప్ లో పడిపోతున్నారు. అందుకే  బీఆర్ఎస్ కు ప్రతీ సారి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఘటనలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ కోరుకున్నది కూడా అదే. బీఆర్ఎస్ చేసింది కూడా అదే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget