అన్వేషించండి

Sharmila Target Jagan : ప్రభుత్వం కన్నా జగన్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్న షర్మిల - కాంగ్రెస్‌వైపు రాకుండా చేసే ప్రయత్నమేనా ?

Andhra Congress : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నైవీపీ అధినేత జగన్ ను సీరియస్ గా టార్గెట్ చేస్తున్నారు. ఆయన పాలన అత్యంత ఘోరంగా ఉందని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు ?

Sharmila criticizes Jagan more than the TDP government :  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రసంగాల్లో ఆమెదైన శైలి ఉంది. కొన్ని సార్లు ఆమె ప్రసంగాలు మీమర్స్ కు కావాల్సింత పని కల్పిస్తూంటాయి.  పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర ..  రెయినీ సీజన్ అంటే వర్షాలు పడే సీజన్ అనే  నేరేటివ్స్  వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఆమె ప్రభుత్వంపై కానీ.. వైసీపీపై కానీ.. జగన్ పై కానీ విమర్శలు చేయడంలో  ప్రత్యేకత చూపిస్తారు. ఇటీవలి కాలంలో ఆమె ప్రభుత్వం కన్నా వైసీపీ అధినేత జగన్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు జగన్ అంత అంత కంటే ఘోరం చేశారని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 

జగన్ లా రైతుల్ని మోసం చేయవద్దని ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి 

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు  చేశారు. గత సీఎం జగన్ లా రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. షర్మిల విమర్శల్లో ప్రభుత్వానికి డిమాండ్లు ఉంటాయి. కానీ జగన్ పై విమర్శలు ఉంటున్నాయి. ఆయన ఐదేళ్ల కాలంలో అత్యంత దుర్భరమైన పాలనను ప్రతి అంశంలో అందించారని.. ప్రజలను అష్టకష్టాలు పెట్టారని గుర్తు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తాయి. కానీ షర్మిల వైసీపీని.. ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసుకుంటున్నారు. అందుకే.. వైసీపీ నేతలకు షర్మిల రాజకీయం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె టీడీపీతో చేతులు కలిపారని విమర్శలు కూడా చేస్తూంటారు. 

హీరోయిన్ జెత్వానీ కేసులో అలా ఇర్కుకున్న ఐపీఎస్‌లు - సీరియస్ కేసులు తప్పవా ?

వైసీపీ బలహీనపడితే బలపడేది కాంగ్రెస్ పార్టీనే !

షర్మిల రాజకీయ విమర్శల వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీని, జగన్ ను  ఎంత బలహీన పరిస్తే తాను అంత బలపడతానని తెలుసు కాబట్టి చాన్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు.  ఏ విషయంలో అయినా  జగన్ ను ఆమె ఏ మాత్రం సహించడం లేదు. ఎప్పుడు ఏ సమస్య మీద మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డిలా మోసం చేయకండి..   జగన్ మోహన్ రరెడ్డిలా వదిలేయకండి..  అని  చెబుతూ హైలెట్ అవుతున్నారు. షర్మిల మాటలను డీకోడ్ చేస్తే...వైసీపీ హయాంలో ఘోరమైన పాలన చేశారని.. అందుకే ఆ పార్టీ గురించి అసలు ఆలోచించవద్దని ప్రజలకు సందేశం ఇస్తున్నట్లుగా ఉంటుంది.  

వేణు స్వామిపై కేసు నమోదుకు కోర్టు - పట్టువదలని జర్నలిస్ట్ మూర్తి వల్లే !

జగన్ కాంగ్రెస్ వైపు రాకుండా చూసే వ్యూహమా  ? 

షర్మిల ముందు ముందు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. జగన్ మోహన్  రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె  గట్టిగా నమ్ముతున్నారు.  జగన్ కాంగ్రెస్ కు దగ్గర అయితే షర్మిల ఎక్కువ ఇబ్బంది పడతారు. సోదరుడితో వచ్చిన విబేధాల వల్లనే రాజకీయంగా వేరు అయ్యారు. ఇప్పుడు మళ్లీ కలిసి  పని చేసే అవకాశం ఉంది. పాత వివాదాలన్నీ సెటిల్ చేసుకున్నా.. సరే తన రాజకీయ భవిష్యత్ ను త్యాగం చేసేందుకు షర్మిల సిద్ధంగా ఉండే అవకాశం ఉండదు. అందుకే  జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్  వైపు రాకుండా ఉండేందుకు  మరింత ఎక్కువగా ఎదురుదాడి చేస్తున్నారని భావిస్తున్నారు.  వచ్చే రెండు, మూడేళ్లలో  జగన్ కేసులు ఓ కొలిక్కి వస్తాయని.. తర్వాత వైసీపీ పరిస్థిథి మరింత దిగజారిపోతుందని చెబుతున్నారు. అదే జరిగితే..  బలపడేది కాంగ్రెస్ పార్టీనే కదా అనేది ఆమె ఉద్దేశం కావొచ్చని చెబుతున్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget