Revant Reddy On Sinha : కేసీఆర్ ను మొదట కలిస్తే యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదు - తేల్చేసిన రేవంత్ !
మొదట కేసీఆర్‌ను కలిసినందునే యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ నేతలు కలవలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Revant Reddy On Sinha : విపక్షాల తరపున రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హా తెలంగాణకు వచ్చారు. అయితే ఆయనను టీఆర్ఎస్ నేతలు మాత్రమే కలిశారు. కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు మాత్రం కలవలేదు. ఈ అంశంపై ఆ పార్టీలోనే దుమారం రేగుతోంది. ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. యశ్వంత్ సిన్హా తమ కోసం రాలేదని..టీఆర్ఎస్ మద్దతు అడగడానికే వచ్చారని.. తాము ఎందుకు ప్రత్యేకంగా వెళ్లి మద్దతు ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. ఇదేవిషయాన్ని మీడియాతో చెప్పారు. నా ఇంటికి వచ్చి తలుపు తడితే తాను తీస్తాను కానీ పక్కింటికి వెళ్లి తలుపు తడితే తానేందుకు తీస్తానని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ బ్యాంక్ దొంగ - ఏం చేస్తున్నాడంటే ?
రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి నిలబడిన తరవాత అభ్యర్థులు కొన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయడం కామన్. అందులో భాగంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టీఆర్ఎస్ చివరి క్షణంలో మద్దతు ప్రకటించింది. కేటీఆర్ యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. టీఆర్ఎస్‌నే తెలంగాణలో ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతూండటంతో యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమాన్ని కూడా టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది.
మామూలుగా అయితే ఇలా ఒకే రాష్ట్రంలో వేర్వేరు పార్టీలతో సమావేశం కావాలనుకున్నప్పుడు వేర్వేరు ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. యశ్వంత్ సిన్హా ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యేవారే కానీ.. మొదట తమతోనే భేటీ కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.అయితే మొదట టీఆర్ఎస్ నేతలతో ప్రోగ్రాం ఉందని మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతామని చెప్పారు. దీనికి యశ్వంత్ టీం అంగీకరించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎలాగూ ఉంటుందని.. టీఆర్ఎస్ విడిగా మద్దతు ఇస్తోంది కాబట్టి ఆ పార్టీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.
దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు
ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ అవుతోంది. వీహెచ్ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టీఆర్ఎస్ నేతలతో కలిసి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు జగ్గారెడ్డి అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.