Yashwant Sinha About KCR: దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు
Yashwant Sinha at Jalavihar Meeting: కేవలం ఒక్క వ్యక్తి చెబితే 135 కోట్ల మంది వింటూ కూర్చోవాలా.. ఇదేనా ప్రజాస్వామ్యం అని జలవిహార్ సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు.
Yashwant Sinha speech at Jalavihar Meeting: దేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నేత అవసరమని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. కేవలం ఒక్క వ్యక్తి చెబితే 135 కోట్ల మంది వింటూ కూర్చోవాలా.. ఇదేనా ప్రజాస్వామ్యం అని జలవిహార్ సభలో యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం భవిష్యత్ తరాల కోసమని చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికలు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య పోరాటం కాదని, వ్యవస్థపై పోరాటమన్నారు. అమెరికా అధ్యక్షుడు స్కూల్‌లో విద్యార్థులను కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మన ప్రధాని మోదీ మాత్రం గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్నారు. ఇలాంటి సమస్యలను సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల తరువాత సైతం మోదీ విధానాలపై దేశం మొత్తం పోరాటం కొనసాగిస్తుంది. కొన్ని రోజులకు సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ అయి మా పోరాటంపై చర్చిస్తామన్నారు. దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.
తక్కువ సమయంలో అద్భుతాలు చేసిన కేసీఆర్
దేశంలో కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణను తక్కువ కాలంలో డెవలప్ చేసిన వ్యక్తి కేసీఆర్. ఇలాంటి విధానాలనే దేశ వ్యాప్తంగా అనుసరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లుగా పోరాటం అనేది ఎప్పుడూ మన కోసం కాకుండా.. మన భావి తరాల కోసం, దేశం కోసం అనేలా ఉండాలన్నారు. ప్రస్తుతం తాము మొదలుపెట్టిన పోరాటం అలాంటిదేనన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైతే మీరు ఏం చేస్తారని అడిగితే.. రాజ్యాంగం విలువలను కాపాడతానని యశ్వంత్ సిన్హా చెప్పారు.
ప్రధాని జవాబు చెప్పరు, ఎందుకంటే..
తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఎన్నో ప్రశ్నలు సంధించిందని, కానీ అందులో ఒక్క ప్రశ్నకు సైతం జవాబు రాదన్నారు. ఎందుకంటే ప్రధాని మోదీ వద్ద ఈ ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. ఎవరైనా చర్చలకు రాకపోతే, స్పందించకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గళం విప్పిన ఒక్క వ్యక్తి కేసీఆర్ అని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత తెలంగాణ సీఎం సొంతమన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని ఇలా ప్రశ్నించారో లేదో అలా ఐటీ, ఈడీ నోటీసులిచ్చారని గుర్తుచేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను గతంలో ఎవరూ దుర్వినియోగం చేయలేదని.. తొలిసారి మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థలను తమ స్వ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు. ఎప్పటివరకైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో అప్పటివరకూ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు.
Also Read: KCR on BJP: మోదీ మాట్లాడటం ఆపి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి :కేసీఆర్
Also Read: TRS Questions PM Modi: తెలంగాణలో కాలుపెట్టక ముందే ప్రధాని మోదీకి అధికార టీఆర్ఎస్ బిగ్ షాక్