అన్వేషించండి

YSRCP: విశాఖ జిల్లా వైసీపీ అభ్యర్థులకు రీసర్వే టెన్షన్ పట్టుకుందా ? తేడా వస్తే మార్పులే ? 

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు రీ-సర్వే టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు... వైసీపీ షాకిచ్చింది.

Visakha YSRCP Leaders : ఉత్తరాంధ్ర వైసీపీ (Ysrcp) నేతలకు రీ-సర్వే ( Reservey) టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు...వైసీపీ షాకిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ రీ సర్వే చేయిస్తున్నట్లు బాంబు పేల్చింది.  విశాఖ( Visakha ) జిల్లాలోని నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. వచ్చే ఎన్నికల్లో (Assembly Elections ) గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ((Jagan ) అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు ఆధారంగా విస్తృతమైన వడపోత పోసింది. ఆ తర్వాత సమన్వయకర్తలు మార్పులు చేసింది. విశాఖ జిల్లాలో అనూహ్యమైన నిర్ణయాలను అమలు చేసింది. సర్వేలు ఆధారంగా కొత్త నాయకత్వం ఎంపిక చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పుంజు  కోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రీ సర్వేలు జరుగుతుండటంతో చివర వరకు రేసులో మిగిలేది ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. 

వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించడమే లక్ష్యం! 
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలన్న లక్ష్యంతో ఉంది. 2019లో యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయ నిర్మలను బరిలోకి దించింది. జనసేన ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోవడంతో వెలగపూడి 25వేల ఓట్లతో గెలుపొందారు. వైసీపీ, జనసేన అభ్యర్థులు యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో విజయ నిర్మల ఓటమి పాలయిందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఆమెకు సీటు గ్యారెంటీ అన్న సమయంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఎదుర్కోవాలంటే... అదే కులం అభ్యర్థి అయితే కరెక్ట్ అనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ అదేశించింది. గెలిచి తీరాలనే లక్ష్యంతో...పండుగలు, వేడుకల్లో కులాలు, మతాల వారీగా ప్రజలు, కేడర్ అవసరాలకు భారీగా డబ్బు కుమ్మరిస్తున్నారు. ఇంత చేసినా తూర్పులో ఎంవీవీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చర్చ జరుగుతోంది. 

అరకు రీ సర్వే 
అరకులోయలో ఎంపీ మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వైసీపీ అధిష్ఠానం. స్థానిక వ్యతిరేకత కారణంగా పునరాలోచనలో పడింది. ఎంపీ మాధవి స్థానంలో నూతన సమన్వయకర్తగా రేగం మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులు తర్వాత మరికొన్ని నియోజకవర్గాలలో రీ సర్వే చేయిస్తోంది. కేప్రజాదరణతో పాటు నాయకత్వం అంగ, అర్ధబలం  ఆధారంగా మరోసారి మార్పులు సాధ్యం అనే దిశగా చర్చ జరుగుతోంది. అటు భీమిలిలో విజయ నిర్మల కుటుంబంపై అధినాయకత్వానికి పాజిటివిటీ ఉండటంతో....యాదవులకు అవకాశం ఇవ్వాలనే పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఈక్వేషన్ ను అధిష్ఠానం వర్కవుట్ చేస్తే ఎంటన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మేయర్ గొలగాని హరి వెంకట కుమారి... అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ-సర్వే ప్రభావం ఇక్కడ మార్పులను ప్రభావితం చేస్తుందా...? లేక ఎంవీవీ సత్యనారాయణ సమర్థత వైపే మొగ్గు చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గాజువాక లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఫస్ట్ లిస్టులోనే వైసీపీ మార్చేసింది. కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించి షాక్ ఇచ్చింది. ఈ మార్పులు ముందుగా ఎమ్మెల్యేకు చెప్పే చేశామని పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ కేడర్ అంగీకరించడం లేదు. గాజువాక,తూర్పు సీట్లలో రీ సర్వేలు ఎవరిని ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget