Perni Nani On Pawan : పవన్ హాబీ పాలిటిక్స్ - చంద్రబాబు కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్న పేర్ని నాని
పవన్ కల్యాణ్ ఫుల్‌టైమ్ రాజకీయ నాయకుడు కాదని పేర్ని నాని అన్నారు.పవన్‌లా మాటలు మార్చే నాయకుడిని ప్రజలు చెప్పుతో కొడతారన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ( Pawan Kalyan ) తన చివరి కేబినెట్ భ్రీఫింగ్ మీడియా సమావేశంలోనూ విమర్శలు చేశారు మంత్రి పేర్ని నాని ( Perni Nani ) . పవన్ కల్యాణ్ హాబీ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాదన్నారు. పార్టీ పెడితే చంద్రబాబును ( Chandra babu ) కలవడం ఏమిటని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బీజేపీని తిట్టారని ఇప్పుడు బీజేపీ సంకలో ఉండి చంద్రబాబుకు కన్ను కొడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా పాచిపోయిన లడ్డూ అని పవన్ అన్నారన్నారు. నాడు బీజేపీ తిట్టి.. ఇప్పుడు పొత్తు అంటున్నారన్నారు.
పింఛన్ డబ్బులు తీసుకుని లవర్ తో జంప్ అయినందుకా వాలంటీర్లకు వందనం - వంగలపూడి అనిత
పవన్ ఎప్పుడూ మాట మీద నిలబడింది లేదన్నారు. ప్రతి ఎన్నికకకు ఒక పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్లుందని చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ ( Janasena ) కేరాఫ్ అడ్రస్ అని పేర్ని నాని అన్నారు. మాటలు మార్చడం... పవన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పవన్ లా మాట మార్చే వారిని ప్రజలు చెప్పుతో కొడతారని పేర్ని నాని అన్నారు. చెగువేరా, పూలే అందరూ అయిపోయారని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నారని పేర్ని నాని అన్నారు. పల్లకి మోయడమే పవన్ కల్యాణ్ పని అని, ఆయన వల్ల ఎవరికీ రాజకీయ ప్రయోజనం, నష్టం ఉండదని పేర్ని నాని అన్నారు.
మంత్రుల పేషీల్లోని ఉద్యోగులందరూ వెళ్లిపోవాల్సిందే ! ప్రభుత్వం తాజా ఆదేశాలు
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పేర్ని నాని తప్పు పట్టారు. గత ఎన్నికల్లో జగన్ ( Jagan ) సీఎం కాడు అని ప్రచారం చేశారని ఇప్పుడు అయ్యారని గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలకు క్రెడిబులిటీ లేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు జనసేన పార్టీ ఆఫీసుల్లో చేగువెరా ఫోటోలు ఉండేవన్నారు. ఇప్పుడు పవన్కల్యాణ్ ఒంటి నిండా చంద్రబాబే ఉన్నారని ఆరోపించారు. ంచంద్రబాబును మోయడం .. చంద్రబాబు భజన చేయడమే పవన్ చేసేదన్నారు. తాను ఎవరి పల్లకీని మోయడానికి రాలేదని ప్రజల్ని పల్లకీ ఎక్కించడానికి వచ్చానని పవన్ అన్న వ్యాఖ్యలపైనా పేర్ని నాని స్పందించారు. 2014 ఎన్నికల్లో ఎవరి ప్లలకీ మోశారని ప్రశ్నించారు.