AP Minister Employees : మంత్రుల పేషీల్లోని ఉద్యోగులందరూ వెళ్లిపోవాల్సిందే ! ప్రభుత్వం తాజా ఆదేశాలు
ఏపీ మంత్రుల పేషీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని మాతృశాఖలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులందరితో రాజీనామాలు తీసుకోనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
![AP Minister Employees : మంత్రుల పేషీల్లోని ఉద్యోగులందరూ వెళ్లిపోవాల్సిందే ! ప్రభుత్వం తాజా ఆదేశాలు AP government has directed the employees working in the offices of AP ministers to go to the parent departments. AP Minister Employees : మంత్రుల పేషీల్లోని ఉద్యోగులందరూ వెళ్లిపోవాల్సిందే ! ప్రభుత్వం తాజా ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/adb8074011406bfc11e4559f63df0f74_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీ మంత్రుల పేషీల్లో పని చేస్తున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 11న రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండటంతో ప్రస్తుత మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీల్లో పని చేస్తున్న వారంతా మాతృశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఓఎస్డీలు, పీఎస్, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ పేరెంట్ డిపార్టుమెంట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.
ఏపీలో కరెంటు కోతల కలవరం! ప్రభుత్వ ఆస్పత్రిలో రాత్రంతా పవర్ కట్! నరకం చూసిన శిశువులు, బాలింతలు
మంత్రివర్గ విస్తరణ పూర్తయిన తర్వాత సదరు అధికారి, లేదా ఉద్యోగి.. తిరిగి మంత్రుల వద్దే పని చేయాలని ఆదేశిస్తే మాతృశాఖతో పాటు సదరు మంత్రుల నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పేషీల్లోని ఉద్యోగులు ఇతర చోట్ల పోస్టింగ్ కోసం సిఫార్సులు చేయించుకుంటున్నారు. కొంత మంది చేరిపోయినట్లుగా తెలుస్తోంది. అనూహ్యంగా మంత్రులందరూ రాజీనామా చేయనున్న సమయంలోనే ఉద్యోగుల్ని మాతృశాఖకు బదిలీ చేయడం అనూహ్యంగా మారింది. సాధారణంగా మంత్రి పేషీల్లో పని చేయడానికి ఇతర డిపార్టుమెంట్లలోనే వారే ఎక్కువగా డిప్యూటేషన్‌పై వస్తారు. మంత్రులు తమకు సన్నిహితులైన వారిని ఎంచుకుంటారు.
నేడే ఏపీ కేబినెట్ చివరి భేటీ, రాజీనామా చేయనున్న మంత్రులు! వీరికి మాత్రమే మళ్లీ ఛాన్స్?
కొంత మందిని ఔట్ సోర్సింగ్ కింద తీసుకుంటారు. మరోవైపు జిల్లాలకు ఆర్డర్ టూ సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు జరిగిన ఉద్యోగుల పదోన్నతులు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఇతర సర్వీసు అంశాలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లనే నోడల్ అధికారులుగా నియమించింది. కొత్తగా మంత్రులయ్యే వారు వారి వారి సన్నిహితులనే తమ పేషిలోపెట్టుకుంటారు కానీ.. పాత మంత్రుల వద్ద పని చేసిన వారిని కొనసాగించడం తక్కువే . అయితే శాఖలో పట్టు ఉన్న పీఏలు.. ఇతర ఉద్యోగుల్ని మాత్రం కొంత మంది మంత్రులు కొనసాగించే అవకాశం ఉంది . అందుకే ప్రస్తుతం తాము చేస్తున్న మంత్రి పదవి పోయినా.. కొత్తగా వచ్చే మంత్రి వద్ద మళ్లీ అదే స్థానంలో ఉండాలని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిని కొత్త మంత్రులు కోరుకుంటే ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)