అన్వేషించండి

కొణతాలతో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌, ఏం చర్చించారంటే!

Pawan Kalyan met with Konatala: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ నగరానికి చేరుకున్నారు. ఏడున్నర గంటలకు నగరానికి వచ్చిన ఆయన నేరుగా పెదవాల్తేరులోని కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.

Pawan Kalyan Met With Konatala In Visakhapatnam : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి ఏడున్నర గంటలకు నగరానికి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పెదవాల్తేరులోని కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. కొణతాల రామకృష్ణ కొద్దిరోజులు కిందటే పార్లీలో చేరారు. ఆయన ఇంటికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఏకాంతంగా కొణతాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

అనంతరం బయటకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సమస్యలు, పార్టీ నిర్మాణం, రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చినట్టు పవన్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటన తరువాత మరింత స్పష్టత వస్తుందని పవన్‌ వెల్లడించారు. కొణతాల ఇంటి నుంచి నోవాటెల్‌ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. అక్కడ పార్టీ నేతలు, కార్పొరేటర్లుతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై వారితో చర్చించారు. 

రెండు రోజలపాటు విశాఖలోనే

పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ రావాల్సి ఉన్నప్పటికీ.. విమానం ఆలస్యం కావడంతో ఏడున్నర గంటలకు విశాఖకు వచ్చారు. సోమవారం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే నేతలకు సమాచారాన్ని అందించారు. పొత్తులు, పోటీ చేసే స్థానాలు, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం, బీజేపీతో పొత్తు వంటి అంశాలను పవన్‌ కల్యాణ్‌ ముఖ్య నేతలతో చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు నుంచి సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Krishna Water War: కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
Church Aid Row: చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget