TRS Rajyasabha Mandava : టీఆర్ఎస్ రాజ్యసభ రేస్‌లో మండవ - కేసీఆర్ డిసైడయ్యారా ?
టీఆర్ఎస్ తరపున రాజ్యసభ రేస్‌లో మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
తెలంగాణలోనూ రాజ్యసభ సీట్ల భర్తీపై కసరత్తు జరుగుతోంది. రెండున్నరేళ్ల పదవీ కాలం ఉన్న స్థానం ఒకటి.. పూర్తి స్థాయి పదవీ కాలం ఉన్న స్థానాలు రెండింటిని భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఎవరికి చాన్స్ వస్తుందో స్పష్టత లేదు. పదవి విరమణ చేస్తున్న డీఎస్, కెప్టెన్ లక్ష్మికాంతరావులకు కొనసాగింపు ఇచ్చే చాన్స్ లేదు. ఈ కారణంగా మూడు స్థానాలకు కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది.
కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్‌గా ఉన్న మండవ వెంకటేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్నుంచి ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. మండవ టిడిపి హయాంలో 4 సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. మంత్రి పదవులు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై మంచి పట్టున్న నేత. కేసీఆర్ కి టిడిపి హాయాంలో ఉన్నప్పటి నుంచి మిత్రుడు. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంటుందని అంటారు. నిజామాబాద్ జిల్లాకే చెందిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మండవకు చాన్స్ ఇస్తారని భావిస్తున్నారు.
రైతుల వద్దకు "డిక్లరేషన్" - "రచ్చబండ" ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి
మండవ టీఆరెస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పదవులు ఆశించలేదు. జిల్లా రాజకీయాల పరిస్థితి, అవసరాల దృష్ట్యా రాజ్యసభ పదవికి ప్రధానంగా మండవ పేరు వినిపిస్తుండటంతో ఆయనకు చాన్స్ దక్కే ఆవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ప్రదాన సామాజికవర్గం మద్దతును కూడగట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లా ? ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా మంచిదా ?
టీఆర్ఎస్ పెట్టక ముందు వరకు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. టీడీపీ నేతలందరితోనూ.. ఆయనకు వ్యక్తిగత పరిచయాలు, బంధం, అనుబంధం ఉంది. కాంగ్రెస్ నేతల కన్నా.. టీడీపీ నేతలతోనే ఆయనకు అనుబంధం ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో.. ఏ నేత ఎలా. ఉపయోగపడతాడో... కేసీఆర్‌కు అంచనా ఉంటుంది. అందుకే.. మండవకు పదవి లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కసరత్తు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటిస్తారు.