Revanth Reddy Rachabanda : రైతుల వద్దకు "డిక్లరేషన్" - "రచ్చబండ" ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి
డిక్లరేషన్‌ను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాహుల్ గాంధీ పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభించాలని తీర్మానం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లోకి..రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ సభలో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ డిక్లరేషన్‌ను రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మే 21 నాడు ప్రతి ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్దేశించారు. 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు జరగాలన్నారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లా ? ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా మంచిదా ?
పీసీసీ అధ్యక్షులుగా తాను వరంగల్ జిల్లాలో జయశంకర్ సార్ స్వంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు.గాంధీభవన్‌లో టీ పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ డీక్లరేషన్ వరంగల్ రైతు సంఘర్షణ సభ జాతీయ స్థాయి లో మంచి గుర్తింపు వచ్చిందని.. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని రేవంత్ తెలిపారు. ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో తీసుకున్న అన్ని అంశాలను ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. జన జాగరణ్ అభియాన్ యాత్రలు .. పెరిగిన ధరలపై కూడా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు.
కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్ దూకుడు
రాహుల్ గాంధీ గారి పాదయాత్ర 100 కిలోమీటర్లు తెలంగాణలో చేస్తారని మొదట తెలంగాణ నుంచే ప్రారంభించాలని తీర్మానం చేశారు. తెలంగాణ లో జరిగే అన్ని పార్టీ కార్యక్రమాలు దేశంలో తెలంగాణ మోడల్ అని పేరొచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్ గా డిజిటల్ మెంబెర్షిప్, వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ మోడల్ గా పేరొచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా తెలంగాణలో చేపట్టి హ్యాట్రిక్ కొడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరి కష్టంతో మనం ఇవన్నీ సాధించాం.. ఒక్క ఏడాది కష్టపడితే అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవలు అందించవచ్చున్నారు.