అన్వేషించండి

BRS Local Party : బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?

Telangana : బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే గుర్తించాలని కేటీఆర్ కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతే హవా అని తమ పార్టీ ఎదుగుతుందని సంకేతాలు పంపుతున్నారు. మరి కేసీఆర్ కాన్సెప్ట్‌ ?

KTR wants BRS to be recognized as a regional party : తెలంగాణ రాష్ట్ర సమితి .. తెలంగాణ  పార్టీ. ప్రజలు తమ పార్టీ అని ఓన్ చేసుకున్న పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీగా కేసీఆర్ ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే పేరుతో తెలంగాణను తీసేసి జాతీయ వాదం తెచ్చారు. తమది జాతీయ  పార్టీ అని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం  ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణలోనే అధికారం కోల్పోవడం.. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి.ఇప్పుడు తమ పార్టీ జాతీయ పార్టీ కానే కాదని.. లోకల్ పార్టీ అని కేటీఆర్ నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

ప్రాంతీయ పార్టీల వల్లే మేలని చెబుతున్న కేటీఆర్ 

లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచార అస్త్రం.. రెండు జాతీయ  పార్టీలు  తమ హైకమాండ్ ఆలోచనల మేరకు పని చేస్తాయని అదే ప్రాంతీయ పార్టీ అయితే ఎవరి ఆంక్షలు ఉండవని తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతామని ప్రచారం చేశారు. ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్. కేటీఆర్ తమది జాతీయ పార్టీ అనే భావన రానివ్వకుండా .. ఇది మీ పార్టీ మీరు కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలకు సంకేతం పంపించారు. కానీ అనకున్న ఫలితాలు రాలేదు. అయితే ఆ కాన్సెప్ట్ ను ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రాంతీయ పార్టీలదే హవా అని చెబుతున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ  కూడా కేటీఆర్ అదే చెప్పారు. 

Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే

పేరు మార్చకుండా బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగా ప్రజలు భావిస్తారా ?

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చేసిన అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఇప్పుడు పల్లెల్లో కూడా క్యాడర్ అనడం లేదు. బీఆర్ఎస్ అనే అంటున్నారు. అంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. పైగా కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీని వదిలేశారని కూడా అనుకుంటున్నారు. ఈ భావన పోయేలా చేయడానికి బీఆర్ఎస్ పార్టీని మరోసారి టీఆర్ఎస్ గా మార్చాల్సి ఉంది. కానీ ఓ సారి పార్టీ పేరు మార్చినందున ఆ పార్టీ పేరును ఈసీ ఫ్రీజ్ చేస్తుంది. మరోసారి ఆ పేరు కేటాయించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ఈ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పేరు మార్పు చేయగలిగితే అంత కన్నా రిలీఫ్ ఉండదని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. 

 Hyderabad News: హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - నగరానికి ప్రభుత్వం కొత్త నిర్వచనం

మళ్లీ తెలంగాణ ప్రజలు తమ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్‌కు మేలు 

తెలంగాణ ప్రజలు ముందుగా బీఆర్ఎస్‌ను ఇది తమ పార్టీ అని గతంలోలా ఓన్ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. మిగతా పార్టీలన్నీ బయట పార్టీలే అని ఎలా అనుకున్నారో అలా అనుకోవాల్సిన  పరిస్థితి కల్పించగలిగితే మళ్లీ బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం వస్తుంది. లేకపోతే.. పుంజుకోవడం అంత తేలిక కాదు.కేటీఆర్ కు ఈ విషయం తెలుసు కాబట్టే  తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సేనని.. తమ ది ప్రాంతీయ పార్టీ అని  చెబుతున్నారు. ప్రజల్ని ఎంతగా నమ్మించగలిగితే బీఆర్ఎస్ అంత బలపడుతుదంని అనుకోవచ్చు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Repo Rate: యథతథంగా రెపో రేట్‌ - వడ్డీ రేట్లు, EMIల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు
యథతథంగా రెపో రేట్‌ - వడ్డీ రేట్లు, EMIల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు
BJP : ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
Hyderabad: మాటలతో మాయచేసిన ట్యాక్సీ డ్రైవర్-లండన్‌ నుంచి వచ్చేసిన వివాహిత - ఇదో గూగుల్‌పే లవ్ స్టోరీ
మాటలతో మాయచేసిన ట్యాక్సీ డ్రైవర్-లండన్‌ నుంచి వచ్చేసిన వివాహిత - ఇదో గూగుల్‌పే లవ్ స్టోరీ
National Film Awards: కమల్, రజనీ, చిరు, ఆమిర్ కాదు... నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
కమల్, రజనీ, చిరు, ఆమిర్ కాదు... నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Repo Rate: యథతథంగా రెపో రేట్‌ - వడ్డీ రేట్లు, EMIల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు
యథతథంగా రెపో రేట్‌ - వడ్డీ రేట్లు, EMIల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు
BJP : ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
ఐపీఎల్‌లో హిట్‌ అయిన ఫార్ములాతో విజయం సాధిస్తున్న బీజేపీ- హర్యానాలోనూ ఫలించిన వ్యూహం
Hyderabad: మాటలతో మాయచేసిన ట్యాక్సీ డ్రైవర్-లండన్‌ నుంచి వచ్చేసిన వివాహిత - ఇదో గూగుల్‌పే లవ్ స్టోరీ
మాటలతో మాయచేసిన ట్యాక్సీ డ్రైవర్-లండన్‌ నుంచి వచ్చేసిన వివాహిత - ఇదో గూగుల్‌పే లవ్ స్టోరీ
National Film Awards: కమల్, రజనీ, చిరు, ఆమిర్ కాదు... నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
కమల్, రజనీ, చిరు, ఆమిర్ కాదు... నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Pawan Kalyan :  పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
పల్లె పల్లెలో పవన్ ముద్ర కనిపించేలా పనులు - వ్యూహాత్మకంగా జనసేనాని ముందడుగు ?
BRS Local Party :  బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
బీఆర్ఎస్‌ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్ - కేసీఆర్ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారా ?
Keerthy Suresh : రోజు రోజుకి నాజూకుగా మారిపోతున్న కీర్తి సురేశ్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
రోజు రోజుకి నాజూకుగా మారిపోతున్న కీర్తి సురేశ్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Viswam: థియేటర్లు దద్దరిల్లేలా 'గుంగురూ గుంగురూ'... గోపీచంద్ సినిమాకు భీమ్స్ మాస్ బీట్
థియేటర్లు దద్దరిల్లేలా 'గుంగురూ గుంగురూ'... గోపీచంద్ సినిమాకు భీమ్స్ మాస్ బీట్
Embed widget