By: ABP Desam | Updated at : 01 Sep 2022 08:44 AM (IST)
బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవాల్సి ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక లోతైన వ్యూహం !
Bihar Special Status : బీహార్ పర్యటనలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలు, మోదీ పరిపాలనపై చాలా స్పందించారు. ఈ మాటల మధ్యలో బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. అయితే ఈ వ్యాఖ్య అషామాషీగా ఉన్నది కాదని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే బీహార్‌లో ప్రత్యేకహోదా అనేది చాలా కాలంగా రాజకీయ అంశం. స్వయంగా నితీష్ కుమార్ కూడా చాలా సార్లు అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీపైన విరుచుకుపడ్డారు. తర్వాత సైలెంటయ్యారు. దేశంలో ఎప్పుడు ప్రత్యేకహోదా ప్రస్తావన వచ్చినా.. బీహార్ నుంచి కూడా " మాకూ కావాలన్న " వాదన వినిపిస్తుంది. అలాంటి చోట కేసీఆర్ ప్రత్యేక హోదా ప్రస్తావన ఆషామాషీగా చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.
జాతీయ రాజకీయాల స్ట్రాటజీలో భాగంగానే బీహార్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెచ్చారా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయిచుకున్నారు. భారత రాష్ట్ర సమితినో లేకపోతే భారత రైతు సమితిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమయింది. ఆయన రైతు సమస్యలపై తెలంగాణ తరహా ఉద్యమాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. అదే సమయంలో ఆయన టార్గెట్ హిందీ రాష్ట్రాలే. అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రాల వారీగా ప్రజల్ని ఆకట్టుకునే నినాదాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బీహార్ వరకూ ప్రత్యేకహోదా అయ్యే చాన్స్ ఉంది. కేసీఆర్ ఈ అంశాన్ని అందుకే పరోక్షంగా ప్రస్తావించారని భావిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదాకూ గతంలో కేసీఆర్ మద్దతు !
అయితే కేసీఆర్ ప్రత్యేకహోదా అంశాన్ని కేసీఆర్ బీహార్‌కే పరిమితం చేయలేదు. గతంలో ఏపీకి ప్రత్యేకహోదాకు ఆయన మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో సంబంధాలు బాగా లేనప్పుడు ఆయన ఏపీకి హోదా ఇస్తే మా పరిస్థితేమిటని నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో కే కేశవరావు లాంటి వారు వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి .. టీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారో అప్పుడు ప్రత్యేకహోదాకు తెలంగాణ మద్దతు ప్రకటించిది. రెండు రాష్ట్రాల్లో 43 మంది ఎంపీలు వైసీపీ,టీఆర్ఎస్‌కు ఉంటే హోదా తీసుకు వస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. జగన్‌తో అప్రకటిత అవగాహన ఉందన్నారు. ఏపీ కి ప్రత్యేకహోదా ఇస్తే తాము అడ్డుకోబోమని ప్రకటించారు. కేసీఆర్ ప్రత్యేకహోదాను అడ్డుకోనని ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.అదే రాజకీయం అనుకున్నారు. కానీ అది ప్రజల్లోకి వెళ్లిందే లేదో తెలియదు కానీ.. ఎన్నికల్లో వైసీపీకే మద్దతు లభించింది.
రాష్ట్రాల వారీగా కేసీఆర్ స్ట్రాటజీల్ని రెడీ చేసుకుంటున్నారా ?
ఇప్పుడు బీహార్‌లోనూ ఇదే ఫార్ములాను కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే భారత రాష్ట్ర సమితి లేదా రైతు సమితితో బీహార్ అధికార పార్టీ కలసి నడుస్తుందని నమ్ముతున్నారు. అదే జరిగితే.. కేంద్రంలోకి తమ ప్రభుత్వం రాగానే బీహార్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కేసీఆర్ .. ఆయన మిత్రపక్షాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే.. అక్కడ కూడా తమ ప్రభుత్వం రాగానే ప్రత్యేకహోదా పేరుతో .. కేసీఆర్ భాగస్వామ్య పార్టీని కూడా పొందే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని
Nizamabad కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!