News
News
X

BJP Kanna : కన్నా బీజేపీకి గుడ్ బై చెబుతారా ? నెక్ట్స్ ఏ పార్టీలోకి ?

బీజేపీని వీడే యోచనలో కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరదల్చుకున్నారో మాత్రం స్పష్టత లేదు.

FOLLOW US: 
Share:

BJP Kanna :  భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో చేసిన ప్రకటన కలకలం రేపింది. పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమవడం వెనుక సోము వీర్రాజు ఏకపక్ష వైఖరే కారణం అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలపై ఆయనకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీలో ఉండటం కన్నా ఏదో ఓ పార్టీలో చేరడమే మంచిదని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత తన రాజకీయ అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. అందులో తన రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టం. కన్నా లక్ష్మినారాయణకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ పార్టీ పరమైన ఆదరణ లేకపోతే గెలుపొందడం కష్టం. గతంలో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం  పాలయ్యారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన తన రాజకీయ అడుగులు వేగంగా వేస్తున్నారని అంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

నిజానికి కన్నా లక్ష్మినారాయణ గత ఎన్నికలకు ముందే  వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి కండువా కప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరిపోయారు. ఆయన వైసీపీలో చేరడం కాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాల్సి రావడంతో ఆయనతో సహా అందరూ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు. అప్పట్నుంచి బీజేపీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. 

ఇప్పుడు పార్టీ మారాలనుకుంటే ఆయన మళ్లీ వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తారా లేక మరో ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. తాను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా ఆయన వైఎస్ఆర్‌సీపీ వైపు చూడకపోవచ్చని చెబుతున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయనకు ఎప్పట్నుంచో రాజకీయ వైరం ఉంది. వైఎస్ హయాం నుంచి చంద్రబాబుపై ఘాటుగా విరుచుకుపడేవారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కన్నా సాఫ్ట్ గానే ఉంటారు. అయితే ఆ పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్త లేదు. కన్నా బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు... అనుచరులతో సమావేశం అవుతున్నారు. కానీ పార్టీ మారుతారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. 

Published at : 19 Oct 2022 05:51 PM (IST) Tags: BJP Somu Veerraju Kanna Lakshminarayana

సంబంధిత కథనాలు

Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్

Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్

MLC Kavitha: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి?: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి?: ఎమ్మెల్సీ కవిత

YSRCP Politics: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారారా, అధిష్టానం ఎలా స్పందిస్తుందో !

YSRCP Politics: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారారా, అధిష్టానం ఎలా స్పందిస్తుందో !

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

టాప్ స్టోరీస్

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!