అన్వేషించండి

Kaleshwaram project investigation politics: కాళేశ్వరంపై పొలిటికల్ గేమ్ - విచారణ పేరుతో ఆరోపణలే - మరి ప్రజలకు నిజాలెప్పుడు తెలుస్తాయి?

Kaleshwaram inquiry : కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ రాజకీయాలు మూడు పార్టీలకు కీలకంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ విచారణ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Kaleshwaram project inquiry politics:  కాళేశ్వరం ప్రాజెక్టు.. ఒకప్పుడు తెలంగాణ గర్వకారణంగా, అపర భగీరథ ప్రయత్నంగా ప్రచారమైంది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు బయటపడటంతో ఈ మెగా ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ పార్టీల మెడకు చుట్టుకున్న  విషమ పరీక్ష గా మారింది. ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, అది కేవలం సాంకేతిక లోపమేనని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,  కేంద్రంలోని బీజేపీ మాత్రం ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే వాడుకుంటున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ - విచారణలో జాప్యంపై ప్రశ్నలు

ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని, అధికారంలోకి రాగానే విచారణ జరిపించి దోషుల నుంచి ప్రజాధనాన్ని కక్కిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా విచారణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ సాగుతున్నప్పటికీ, ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేంద్రాన్ని కోరడం వెనుక తన బాధ్యతను కేంద్రంపైకి నెట్టివేసే వ్యూహం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏజెన్సీలతో పూర్తిస్థాయి క్రిమినల్ విచారణ జరపకుండా, కేవలం నివేదికలను కేంద్రానికి పంపి సైడ్ అయిపోవడంపై సామాన్య ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ వ్యూహం - ఆరోపణలకే పరిమితమా?

బీజేపీ కూడా కాళేశ్వరం అవినీతిపై భారీ ఎత్తున గళమెత్తింది. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ ప్రధాని, కేంద్ర మంత్రులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసినా, కేంద్రం ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదన్నది ఒక మిస్టరీగా మారింది. విచారణ జరిపితే ఎక్కడ బీఆర్ఎస్ పట్ల సానుభూతి పెరుగుతుందో లేదా రాజకీయ సమీకరణాలు మారతాయో అన్న సందేహంతోనే బీజేపీ వెనకడుగు వేస్తోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆరోపణలు చేయడం తప్ప, యాక్షన్ తీసుకోవడంలో కేంద్రం జాప్యం చేయడంపై విపక్షాలు ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.

బీఆర్ఎస్ ఆత్మరక్షణ 

మేడిగడ్డ కుంగుబాటు బీఆర్ఎస్‌కు పెను రాజకీయ సమస్యగా మారింది. ప్రాజెక్టు డిజైన్లలో లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  నివేదికలు స్పష్టం చేయడంతో, ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అయితే, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని, మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును రాజకీయాల కోసం బలిపెట్టవద్దని, వెంటనే నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నిజాల కోసం ప్రజల నిరీక్షణ

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కాళేశ్వరంపై పూర్తిస్థాయి వాస్తవాలను బయటపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయే తప్ప, అసలు దోషులు ఎవరు? ఆ సొమ్ము ఎక్కడికి పోయింది? మేడిగడ్డ ఎందుకు కుంగింది? అనే ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు ప్రజలకు అందడం లేదు.  రాజకీయం ముసుగులో నిజాలు సమాధి అవుతున్నాయని సామాన్యులు భావిస్తున్నారు.  కాళేశ్వరం కేవలం రాజకీయాల వేదిక కాకూడదు, అది ప్రజల ఆస్తి అనే స్పృహతో అన్ని పార్టీలు వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని  డిమాండ్ చేస్తున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget