Jagan Vs Sharmila : జగన్ కాంగ్రెస్‌కు దగ్గరైతే షర్మిల దారెటు ? అన్నతో రాజీపడతారా ?
YS Sharmila And Jagan : జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పంథాను మార్చేసుకుంటున్నారు. ఇండియా కూటమికి దగ్గరవుతున్నారు. మరి షర్మిల ఏం చేయబోతున్నారు ?
Sharmila Next Plan : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు ఏపీలో ఆయన సోదరి షర్మిలకు షాక్ ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని.. కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే.. ఆటోమేటిక్ గా వైసీపీ బలహీనపడుతుందని షర్మిల అంచనా వేసుకున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు షర్మిలను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ దగ్గర అయితే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జగన్ మళ్లీ ఇండీ కూటమిలో చేరినా... కాంగ్రెస్ కు దగ్గరైనా షర్మిలకే ప్రాధాన్యమిస్తామని చెప్పి పంపించారని అనుకున్నారు. అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సముద్రమని పిల్ల కాలువలన్నీ కాంగ్రెస్ లో చేరాల్సిందేనని ప్రకటించారు. ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచన చేరాల్సిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు. కానీ ఇంత వేగంగా పరిణామాలు ఉంటాయని షర్మిల కూడా ఊహించి ఉండరు.
కాంగ్రెస్ బలపడితే వైసీపీకే నష్టం
కాంగ్రెస్ ఎంత బలపడితే అంత నష్టం వైసీపీకే. కాంగ్రెస్ దగ్గరవుతున్న సంకేతాలను జగన్ పంపడం వెనుక ఇదే సీక్రెట్ ఉందనుకుంటున్నారు. తాను కాంగ్రెస్ నీడలోనే ఉన్నానన్న సంకేతాలను ఢిల్లీ ధర్నా ద్వారా ప్రజలకు పంపారు. ఓ వైపు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ వైఎస్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి అండగా ఉంటున్నారని ముస్లిం, దళితులను మోసం చేస్తున్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ కొంత షర్మిలకు వెళ్లింది. ముఖ్యంగా రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ కారణం. వచ్చే రోజుల్లో షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేసి ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్ పది శాతం ఓట్లు తెచ్చుకుంటే జగన్ ఓటు బ్యాంక్ ముఫ్ఫై శాతానికి పడిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రాకపోవచ్చు.
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
షర్మిల రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరం
జగన్ ఢిల్లీ ధర్నాను హాడావుడిగా ప్రకటించడం దానికి ఇండీ కూటమి నేతలంతా పోలోమంటూ రావడం వెనుక ఓ ప్రణాళిక ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఇప్పుడు షర్మిలకు ఇబ్బందే. ఆమె జగన్ పై విమర్శలు కొనసాగించవచ్చు. కానీ జగన్ దగ్గరవుతున్నారు కాబట్టి షర్మిలను ప్రోత్సహించాలా లేదా అన్నదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు షర్మిల ప్లాన్ బీ ఆలోచించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ను బతికించాలని షర్మిల ఆ పార్టీలో చేరలేదు. రాజకీయ అనివార్యతల కారణంగానే చేరారు. రాజకీయంగా తాను సస్టెయిన్ కావాలంటే కాంగ్రెస్ అండ ఉండాల్సిందేననుకున్నారు. ఆమె రాజకీయాలపై దూకుడుగా ఉండటానికి కారణం జగనే. ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమెను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు.
జగన్ పాలనలో రూ.850 కోట్ల యాడ్స్ స్కామ్ - అసెంబ్లీలో లెక్కలు బయటపెట్టిన కూటమి నేతలు
అన్నతో షర్మిల రాజీ పడతారా
కాంగ్రెస్ కు తాను దగ్గరవ్వాలంటే... షర్మిలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షరతుగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకుకు షర్మిలనే ప్రధాన ముప్పు. ఈ విషయం గ్రహించనంత అమాయక రాజకీయ నాయకురాలు షర్మిల కాదనుకోవచ్చు. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లక ముందే ఇద్దరు వైసీపీ కార్యక్రతల మధ్య జరిగిన హత్య కేసు పేరుతో డిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారని ఆరోపించారు. అయితే ఇండీ కూటమితో ఆయన ముందే ఒప్పందం చేసుకున్నారని కాస్త ఆలస్యంగా గ్రహించారుని అంటున్నారు. ఇప్పుడు షర్మిల మరోసారి క్రాస్ రోడ్ లో నిలబడినట్లయింది. ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. చెల్లితో రాజీ చేసుకోవడానికి జగన్ రెడీ అయితే.. ఆ ఫార్ములా షర్మిలకు ఓకే అయితే సమస్య ఉండదు. కానీ షర్మిల రాజకీయంగా ఎదగాలి అనుకుంటే.. ప్లాన్ బీని అమలు చేసుకునే అవకాశం ఉంది.