అన్వేషించండి

Andhra Pradesh : వైసీపీ హయాంలో అవినీతి కేసుల్లో దూకుడే - ఇక సీఐడీ పని అదేనా ?

Chandrababu : వైసీపీ హయాంలోని అవినీతి కేసులపై విచారణ, అరెస్టులు ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించారు.

Investigations and arrests on corruption cases under YCP regime will gain momentum : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయింది. వంద రోజుల పాలనలో మంచి చేశామని మనది మంచి ప్రభుత్వం అని  ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో మాత్రం అసంతృప్తి పెరిగిపోయిందన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వేధించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పకడ్బందీ కార్యాచరణను ఖరారు చేసుకునేదిశగా ప్రభుత్వం రెడీ అయింది. నారా లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందని ప్రకటించారు. మరో వైపు చంద్రబాబు స్వయంగా ఈ కేసులపై సమీక్ష చేశారు. 

వైసీపీ హయాలో అనేక స్కాంలపై విచారణలు

వైసీపీ హయాంలో మైనింగ్, మద్యం, ఇసుక సహా అనేక స్కాంలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో గనుల శాఖ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. రెండున్నర వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసులు పెట్టింది. ఇక మద్యం విషయంలో అతి పెద్ద స్కామని చెబుతోంది. ఇప్పటికే కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు. ఇక మైనింగ్ సహా ఇతర అంశాల్లో విచారణలు జరుగుతున్నాయి. హీరోయిన్ జెత్వానీ కేసులో లోతైన విచారణ జరిపి దారి తప్పిన అధికారుల్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. అలాగే.. టీడీపీ హయాంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసులు పెట్టేదిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. 

ఏపీలో కానిస్టేబుళ్ల నియామకంపై ముందడుగు - హోంమంత్రి అనిత కీలక ప్రకటన

కేసుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష

తమ హయాంలో కక్ష సాధింపులు ఉండవు కానీ.. తప్పు చేసిన  వారిని వదిలే ప్రసక్తే లేదని  చంద్రబాబు చెబుతున్నారు.ఈ ప్రకారం ఆధారాలు ఉన్న ప్రతి అంశంలోనూ కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తమకు అందుతున్న సమాచారం, సాక్ష్యాల ఆధారంగా కేసులు పెట్టబోతున్నారు. కక్ష సాధింపులు అనే ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ఈ కేసుల్ని డీల్ చేయాలనుకుటున్నారు. అయితే చేసే ఆరోపణలు చేస్తూనే ఉంటారని వారిని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చంద్రబాబు సూచించారు. అందుకే చాలా కేసుల విషయంలో ముందుగా సాక్ష్యాల సేకరణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అరెస్టుల వంటి కార్యాచరణ చేపట్టనున్నారు. 

Also Read: Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

వైసీపీ హయాంలో అవినీతి వ్యవహారాలు, కేసుల విచారణను సాధారణ పోలీసు విభాగం దర్యాప్తు చేయడం వల్ల ఆలస్యం అవుతుంది కాబట్టి సీఐడీకి కేసులన్నీ బదలాయించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటికే మదనపల్లి పైల్స్ కాల్చివేత అంశంపై దూకుడుగా సీఐడీ విచారణ జరిపింది. రెండు, మూడు రోజుల్లో ఇతర కీలక కేసుల్లోనూ సీఐడీ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. అధికారంలోకి వచ్చినా ఏమీ చేయడం లేదనుకుంటున్న అనేక మంది వైసీపీ నేతలకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget