Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
Ration Cards: రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఒక్కో లబ్ధిదారునికి సబ్సిడీపై కిలో కందిపప్పు, అరకేజీ పంచదారను పంపిణీ చేయనుంది.
AP Government Gave Subsidary Groceries To Ration Card Holders: రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, పంచదార అందించనుంది. ఈ మేరకు గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. ఈ నెల నుంచి ఒక్కో కార్డుదారునికి రూ.67కే కిలో కందిపప్పు, రూ.17కే అరకేజీ చక్కెర పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్‍లో నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి రూ.150, రూ.160, రూ.170 ఉండగా.. కిలో షుగర్ ధర రూ.50కి పైగా పలుకుతోంది.
దీని ద్వారా రాష్ట్రంలో 4.30 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. అలాగే, వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుల ద్వారా రాగులు, ఇతర మిల్లెట్స్ అందించబోతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం బస్తాల్లో రేషన్ షాపులకు కందిపప్పు, పంచదార పంపించేదని.. ఇప్పుడు జీఎస్టీ అదనపు భారమైనా ప్యాకింగ్ చేసి నాణ్యమైన సరుకులను అందిస్తున్నట్లు చెప్పారు.
1 KG కందిపప్పు రూ.67
— Manohar Nadendla (@mnadendla) October 1, 2024
1/2 KG పంచదార రూ.17.
నేటి నుంచి 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభము.
నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం!
తెనాలి నియోజకవర్గంలోని 21వ వార్డులో కందిపప్పు, పంచదార పంపిణీ కార్యక్రమంలో రేషన్… pic.twitter.com/NUyduFjvRq