అన్వేషించండి

INDIA Alliance Splits: ప్రాంతీయ పార్టీల్లో చీలికలు - ఇండీ కూటమిలో ప్రకంపనలు - మరి కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్‌గా ఉంటారా?

Congress Defections: ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరిపోతున్నారు.దీని కోసం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. మరి కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీతోనే ఉంటారా?

BJP Strategy Anti Defection Law:   జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. విపక్షాల  ఇండీ  కూటమిలో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్  తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో విలీనం అయ్యారు. దీనికి తోడు డీఎం  కూటమి నుంచి బయటకు రావడం, ఆమ్ ఆద్మీ పార్టీ  కి చెందిన రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఏకంగా బీజేపీలో విలీనమవ్వడం చూస్తుంటే, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో బీజేపీ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన కూడా చీలిపోయింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీలపై కూడా ఇదే తరహా కత్తి వేలాడుతోంది. అయితే ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది... ప్రాంతీయ పార్టీలన్నింటినీ చీలుస్తున్న బీజేపీ వ్యూహకర్తలు, కాంగ్రెస్ పార్టీని మాత్రం అలానే వదిలేస్తారా?

 కాంగ్రెస్ ఎంపీలు ఖాళీగా ఉంటారా? 

ప్రాంతీయ పార్టీల నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార ఎన్డీయే   వైపు లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిశ్శబ్దంగా ఉండరనే సంకేతాలు అందుతున్నాయి. కేంద్రంలో మూడోసారి బలమైన అధికారంలో ఉన్న బీజేపీ, ప్రస్తుతం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణలకు  అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల ఎంపీలను లాక్కోవడంతో పాటు, కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎంపీలపై కూడా కన్నేసింది. రాజకీయం ఎటువైపు మొగ్గుతుందో గమనించే కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం లోపాయికారీగా అధికార పక్షంతో టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం.

 యాంటీ-డిఫెక్షన్ లా   చిక్కుముడులు 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారితే వారి పదవులు ఊడిపోతాయి. కానీ, మొత్తం ఎంపీలలో మూడింట రెండొంతుల   మంది కలిసి విడిపోతే లేదా వేరే పార్టీలో విలీనమైతే చట్టబద్ధంగా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆప్   విషయంలో రాఘవ్ చద్దా సరిగ్గా ఇదే ఫార్ములాను వాడారు. తృణమూల్ ఎంపీలదీ ఇదే ఫార్ములా.  ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ ఇదే తరహా గ్రూపును తయారు చేయడం బీజేపీ వ్యూహకర్తలకు అసాధ్యమేమీ కాదు.   ప్రాంతీయ పార్టీలలోనైనా, కాంగ్రెస్‌లోనైనా విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అంతర్గత అసంతృప్తి, బలమైన నాయకత్వం లేకపోవడమే. ఎన్నికల్లో ఓటములు, కూటముల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎంపీలలో రక్షణ లేని భావన  మొదలవుతుంది. ఈ బలహీనతనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్  కు ముడిసరుకుగా వాడుకుంటుంది. ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి ,  రాజకీయ మనుగడ కోసం లొంగిపోతుంటే, కాంగ్రెస్ ఎంపీలు సైతం తాము ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలనే నైరాశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 బీజేపీ అల్టిమేట్ ప్లాన్ - కాంగ్రెస్ ముక్త్ భారత్ 

బీజేపీ అగ్రనాయకత్వానికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ఎంత ముఖ్యమో, తమ ప్రధాన జాతీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేయడం అంతకంటే ముఖ్యం. ప్రాంతీయ పార్టీల పతనం పూర్తి కాగానే, అవసరమైన తరుణంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోనే అతిపెద్ద చీలిక తెచ్చి, ఆ పార్టీని పార్లమెంట్‌లో నామమాత్రంగా మార్చాలనేది తెరవెనుక వ్యూహం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలు  బీజేపీలో విలీనమైన చరిత్ర ఉంది. అదే ఫార్ములాను ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎంపీలపై ప్రయోగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 ఇండీ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే! 

ప్రస్తుత పార్లమెంట్ నెంబర్ గేమ్ చూస్తుంటే, ఎన్డీయే కూటమి క్రమంగా రాజ్యసభలో మెజారిటీకి చేరువవుతోంది, లోక్‌సభలోనూ బలపడుతోంది. డీఎంకే, తృణమూల్, ఆప్ లాంటి శక్తులే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేస్తున్న తరుణంలో... కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలను ఎంతవరకు కాపాడుకోగలదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలలో గనుక చీలిక వస్తే, అది ‘ఇండీ’ కూటమి పతనానికి ఆఖరి మేకు  కొట్టినట్లవుతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan 2.0 Super App Launched: వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?
Tollywood Fans Political Agenda: ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
AP New Pattadar Passbooks Rajamudra: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టు రాజముద్ర - పాస్‌బుక్‌లపై జగన్ ఫోటో తొలగింపు - చంద్రబాబు మార్క్ జనాకర్షక వ్యూహం!
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టు రాజముద్ర - పాస్‌బుక్‌లపై జగన్ ఫోటో తొలగింపు - చంద్రబాబు మార్క్ జనాకర్షక వ్యూహం!
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget