అన్వేషించండి

Jagan 2.0 Super App Launched: వైసీపీ కార్యకర్తల కోసం సూపర్ యాప్ - ఆవిష్కరించిన జగన్ - ఇది ఎందుకంటే ?

YSRCP Official App: జగన్‌ 2.ఓ సూపర్‌ యాప్‌ను ఆవిష్కరించారు. కార్యకర్తల రక్షణకు డిజిటల్ డైరీ అనుసంధానం, కుట్రలను తిప్పికొట్టేలా వైసీపీ సొంత ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

Jagan Countering Social Media Content Deletion:   సమకాలీన రాజకీయాల్లో డిజిటల్ నెట్‌వర్కింగ్, సోషల్ మీడియా వ్యూహాలు అత్యంత కీలకంగా మారిన తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఒక విప్లవాత్మక అడుగు వేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికారిక  జగన్ 2.ఓ సూపర్ యాప్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఇతర సామాజిక మాధ్యమాల్లో వైసీపీ కార్యకర్తల కంటెంట్‌ను అణచివేస్తున్నారన్న కారణంగా , ఎవరూ అడ్డుకోలేని విధంగా సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను కుట్రపూరితంగా డిలీట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలను తిప్పికొట్టడానికే  జగన్ 2.ఓ సూపర్ యాప్ ను తీసుకువచ్చినట్లు ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో పార్టీకి చెందిన సొంత యాప్ కావడం వల్ల, ఇందులో కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా పంచుకోవచ్చని, బయటి వ్యక్తులు ఎవరు పడితే వారు కంటెంట్‌ను డిలీట్ చేసే హక్కు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సూపర్ యాప్ ద్వారా పార్టీలోని క్షేత్రస్థాయి చిన్న కార్యకర్త మొదలుకుని తాడేపల్లి కేంద్ర కార్యాలయం వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉంటారని జగన్ వివరించారు. గ్రామం, నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ ఒకే వేదికపైకి రావడం వల్ల సమన్వయం సులువవుతుందన్నారు. అంతేకాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలతో పాటు, రాజకీయ ప్రత్యర్థులు లేదా పోలీసుల వేధింపుల వల్ల ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ నాయకత్వంతో టచ్‌లో ఉండే అద్భుత అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.  

కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఈ యాప్‌లో మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. పార్టీ నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్ మీట్లు, ముఖ్యమైన అధికారిక ప్రకటనలు లైవ్ ఫీడ్   ద్వారా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ప్రస్తుతం వైసీపీ నిర్వహిస్తున్న డిజిటల్ డైరీ ని కూడా ఈ యాప్‌తో అనుసంధానం చేశారు. దీనివల్ల వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు నేరుగా యాప్ ద్వారానే డిజిటల్ డైరీలో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని, బాధితులకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులన్నీ అండగా నిలబడతాయని జగన్ భరోసా ఇచ్చారు.

ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైఎస్సార్‌సీపీపై జరుగుతున్న అనుచిత విమర్శలు, మార్ఫింగ్ వీడియోలపై చట్టపరమైన ఫిర్యాదులు చేస్తూనే.. మరోవైపు పార్టీని డిజిటల్ పరంగా స్వావలంబన వైపు నడిపించేందుకు ఈ సొంత ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను సాంకేతికంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చారిత్రాత్మక డిజిటల్ అడుగు ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తన సోషల్ మీడియా ఉనికిని మరింత శక్తివంతంగా మార్చుకోబోతోందని  భావిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget