అన్వేషించండి

Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

Harish Rao BJP Rumours: హరీష్ రావుపై ప్రతీ సారి రూమర్స్ సృష్టించడం, దానికి ఆయన వివరణ ఇచ్చుకోవడం కామన్‌గా మారిపోయింది. ఈ రాజకీయం బీఆర్ఎస్‌లో ఎటు దారి తీస్తుంది?

Harish Rao Political Future Telangana: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు చుట్టూ సాగుతున్న రాజకీయ వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన నా పుట్టుక బీఆర్ఎస్‌లోనే.. నా చావు కూడా బీఆర్ఎస్‌లోనే అంటూ చేసిన భావోద్వేగ ప్రకటన, ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడికి అద్దం పడుతోంది. హరీష్ రావు ఇమేజ్‌ను దెబ్బతీయడానికి , బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయడానికి ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.   

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుండి గులాబీ జెండాను భుజాన వేసుకుని, పార్టీకి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించిన నేత హరీష్ రావు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి.. తాను కట్టె కాలే వరకూ బీఆర్ఎస్‌లోనే ఉంటానని, కేసీఆరే తన బాస్ అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయనకు ఉన్న పొలిటికల్ స్టేచర్,  ప్రజాదరణ దృష్ట్యా ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ వంటి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమే లేదు. అయినప్పటికీ, ఆయనపై నిరంతరం వలసల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రచారం ద్వారా హరీష్ రావును నిరంతరం డిఫెన్స్‌లోకి నెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి  చిట్ చాట్ వ్యూహం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో  చిట్ చాట్ నిర్వహించినప్పుడల్లా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందనేది స్పష్టమవుతోంది. హరీష్ రావు లోపాయికారీగా వేరే పార్టీలతో గూడుపుఠాణీ చేస్తున్నారనో, లేదా ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా హింట్లు ఇస్తుంటారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ అవ్వడం.. దానికి కౌంటర్ ఇచ్చుకోవడానికి హరీష్ రావు తన విలువైన సమయాన్ని, శ్రమను  వెచ్చించాల్సి వస్తోంది.  ఇది ప్రత్యర్థుల విజయంగా భావించవచ్చు. పరిపాలనపై, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేయాల్సిన పోరాటాన్ని పక్కదారి పట్టించి.. హరీష్ రావును సొంత పార్టీలోనే ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం.

 అనుమానాలు సృష్టిస్తే.. ప్రత్యర్థుల వ్యూహం ఫలించినట్లే! 

ఈ రాజకీయ ప్రచారాల వెనుక ఉన్న అసలైన ప్రమాదం హరీష్ రావుకు బయట పార్టీల నుంచి వచ్చే ముప్పు కాదు; సొంత పార్టీలోనే ఆయనపై అనుమానాలు తలెత్తేలా చేయడం. ఒకవేళ ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ పుకార్లను నమ్మి హరీష్ రావును అనుమానిస్తే.. ఈ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల వ్యూహం వంద శాతం ఫలించినట్లే అవుతుంది. నిరంతరం వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఏ నాయకుడికైనా మానసిక క్షోభను కలిగిస్తుంది. సొంత గూటిలోనే నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తే, అది హరీష్ రావు రాజకీయ ప్రస్థానాన్ని మాత్రమే కాదు.. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెడుతుంది. ఒకవేళ ఈ మైండ్ గేమ్ వల్ల ఆయన సైలెంట్ అయితే, అది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. హరీష్ రావు లాంటి మాస్ లీడర్ మరియు ట్రబుల్ షూటర్‌ను కోల్పోవడం లేదా ఆయనను నైతికంగా బలహీనపరచడం వల్ల గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుంది.  

 నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి? 

25 ఏళ్లుగా ఒకే పార్టీ నమ్ముకుని, సిద్ధిపేటను అజేయమైన కోటగా మార్చిన హరీష్ రావు తన విశ్వసనీయతను ప్రతిసారీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కేసీఆర్ మేనల్లుడు కావడం వల్లే ఆయనను వారసత్వ పోరులోకి లాగి, పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.  ఈ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ప్రత్యర్థులు విసిరే ట్రాప్‌లో పడకుండా, హరీష్ రావుకు పార్టీలో పూర్తి స్వేచ్ఛ మరియు మద్దతు ఇస్తేనే.. బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించగలదని బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయం.   రేవంత్ రెడ్డి వేస్తున్న పొలిటిక పాచికలను తిప్పికొట్టాలంటే.. కేవలం హరీష్ రావు వివరణలు సరిపోవు, బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆయన వెనుక తాము బలంగా ఉన్నామనే సంకేతాన్ని క్యాడర్‌కు పంపాల్సి ఉంది.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget