అన్వేషించండి

Where is Harish Rao: కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?

KCR Meeting | జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తోంది. ఏడాది తరువాత కేసీఆర్ బహిరంగ వేదిక మీద ప్రసంగించనున్న కార్యక్రమానికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు అందుబాటులో లేరు.

హైదరాబాద్/ జగిత్యాల: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్  నిర్వహించబోయే సభలపైనే ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ జగిత్యాల సభతో ప్రజల ముందుకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కేసీఆర్ ఎలాంటి విమర్శలు చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

జగిత్యాల సభకు అందుబాటులో లేని హరీష్ రావు..

ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ కీలక నేతల్లో ఒకరైన ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల బహిరంగ సభకు అందుబాటులో ఉండటం లేదు. ఆయనతో పాటు బి. వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం ఢిల్లీలో సీనియర్ లాయర్లతో సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.  

ఏప్రిల్ 8న వెల్లడించాల్సిన తీర్పును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. తీర్పు కనుక తమకు వ్యతిరేకంగా ఏం చేయాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఢిల్లీలో సీనియర్ లాయర్లతో చర్చించడానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతో ఆయన లేకుండా కేసీఆర్, కేటీఆర్ జగిత్యాల సభను నడిపించనున్నారు. ఏడాది తరువాత కేసీఆర్ హాజరై ప్రసంగించనున్న సభకు హరీష్ రావు అందుబాటులో లేకపోవడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 

కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ మార్క్ పంచ్‌లు !
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలును కేసీఆర్ అస్త్రంగా మార్చుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బహిరంగ సభలకు దూరంగా ఉంటూ, కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చారు. అయితే, ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ముగియడంతో, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా ఎండగట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఏడాది వరంగల్ ప్లీనరీ తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న భారీ సభ ఇదే కావడంతో, ఆయన దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

జగిత్యాల - బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ వేదిక
 జగిత్యాల గడ్డపై కేసీఆర్ నిర్వహించిన సభలన్నీ విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ జరిగిన తొలి సభతోనే బీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అలాగే, 2003లో ధర్మపురిలో కేసీఆర్ చేసిన సింహగర్జనతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం దిగివచ్చి గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఇలా జగిత్యాల వేదికగా జరిగిన ప్రతి పోరాటం తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని పోసింది.

సభపై భారీ ఆశలు - పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 2004లో ఎంపీగా కేసీఆర్, ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి పొత్తులో గెలిచిన నేపథ్యం కూడా ఈ జిల్లాకు ఉంది. ఇప్పుడు అదే జిల్లా నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. జగిత్యాల మినీ స్టేడియంలో జరిగే ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చేలా ఇన్‌చార్జులను నియమించి జన సమీకరణ చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget