అన్వేషించండి

Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?

Musi Project : మూసి ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కానీ హఠాత్తుగా తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని చెప్పాల్సి వస్తోంది. ఎందుకిలా మారిపోయింది.

Did BRS and BJP fall into Revanth  trap on the Musi Project : తెలంగాణ రాజకీయాల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టు విషయంలో ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. విదేశీ పర్యటనల్లోనూ నగరాల్లో ఉన్న నదులను .. వాటి నిర్వహణను పరిశీలించారు. అలాగే హైదరాబాద్‌లోనూ అభివృద్ధి చేయలనుకుంటున్నారు. కేవలం శుభ్రం చేయడం కాకుండా ఆ నది చుట్టూ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతి దశలోనూ ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్రమణలు తొలగించే దశలో ఉన్నారు. అయితే ఈ ఆక్రమణలు తొలగించే ముందు హైడ్రా కూల్చివేతలు సంచనలం రేపాయి. దాంతో తీవ్ర వివాదాస్పదమయింది.  రాజకీయ పార్టీల ఇంత కన్నా మంచి అవకాశం రాదన్నట్లుగా ఆక్రణల కూల్చివేత్లని అడ్డుకుంటామని వెళ్లి ప్రజలకు భరోసా ఇచ్చి వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన అడుగులు ముందుకు వేస్తున్నారు.  

బీఆర్ఎస్ హయాంలో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు 

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కొత్తది కాదు. భారత రాష్ట్ర సమితి సర్కారులోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆక్రమణల్ని గుర్తించారు. మూసిని సుందీరకరణ చేసేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని దానికి చైర్మన్ ను చేశారు. కానీ అడుగులు ముందుకు పడలేదు. రేవత్ రెడ్డి ఆ ప్రాజెక్టును లార్జర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే ఇప్పుడు ఆక్రమణల్ని కూల్చివేతను బీఆర్ఎస్ వ్యతిరేకించడం ప్రారంభించింది. బీఆర్ఎస్‌కు బీజేపీ కూడా జత కలిసింది. దీంతో ఆక్రమణదారుల వద్దకు వెళ్లి కూల్చి వేయనివ్వబోమని భరోసా ఇస్తున్నారు. కానీ గతంలో కేటీఆరే ఆక్రమణల్ని కూల్చివేయాలని ఆదేశిస్తున్న వీడియో కాంగ్రెస్ నేతలు వైరల్ చేశారు. 

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!

మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని చెప్పాల్సిన పరిస్థితి

మూసి ఆక్రమణ దారులు స్వయంగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది . వారికి ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని బెదిరిస్తున్నారని తాను నిరూపిస్తానని అంటున్నారు. కానీ అలాంటి నేతలు తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని చెప్పేలా రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం పాటించారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ ప్రజలు విషం తాగాల్సి వస్తుందన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే నల్లగొండలో సమస్య వస్తుందన్న అభిప్రాయం కల్పించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా .. మూసి ప్రక్షాళకు వ్యతిరేకంగా కాదని నిర్వాసితులకు న్యాయం చేయాలన్నవాదన వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది. 

మూసి ఆక్రమణ తొలగింపును వ్యతిరేకించే వారిపై నల్లగొండ అస్త్రం - రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌తో విపక్షాలు తగ్గాల్సిందేనా ?

మూసి విషయంలో విపక్షాలను రేవంత్ ఫిక్స్ చేసినట్లే ! 

గత నాలుగు రోజులుగా మూసి ఆక్రమణల విషయంలో రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తారని అనుకున్నారు. అందుకే ఆ ఆపేసిన క్రెడిట్ తమకు అంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీలు పడ్డాయి. కానీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని స్పష్టమన సంకేతాలు పంపారు.అంటే. .. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు కొనసాగుతుందని తేల్చేశారు. నిజానికి న్యాయవ్యవస్థ కూడా ఆక్రమణల్ని సమర్థించదు. నిబంధనల ప్రకారం కూల్చేయాలనే చెబుతుంది. అందుకే రేవంత్ ధైర్యంగా మందుకెళ్తున్నారని అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
Embed widget