అన్వేషించండి

YS Jagan : మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి - ఎమ్మిగనూరు సభలో జగన్ పిలుపు !

Andhra : మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు.

YSRCP : మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని వైసీపీ అధినేత జగన్ ఎమ్మిగనూరు సభలో జగన్ పిలుపునిచ్చారు.  పేదల సొంతింటి కలను నెరవేర్చాం. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకొచ్చాం. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు.  ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నానన్నారు.   ఎమ్మిగనూరు   ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ల 

మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కు అండగా నిలిచేందుకు  తాను సిద్ధంగా ఉన్నానన్నారు.  సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని చెబుతున్నాయన్నారు.  మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోందన్నారు.  జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా అని పిలుపునిచ్చారు.                
 
 విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని..  కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామన్నారు.  రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకొచ్చాం. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు.  ధనికులకు అందే చదువునే పేదలకు కూడా అందిస్తున్నామన్నారు.  మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  
 
 ఇంగ్లీష్‌ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.   పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నవారికి .. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయాలన్నారు.  బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించాలన్నారు.  మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నవారికి బుద్ది చెప్పాలని పిలుపుిచ్చారు.  ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయన్నారు.  మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని ఆరోపించారు.                           

‘2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా? అని జగన్ ప్రశ్నించారు.  ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్‌ సిక్స్‌ అంటూ వస్తున్నాడు. ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.       

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget