News
News
X

Where Is CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ మౌనానికి కారణం ఏమిటి ? 17 తర్వాత ఏం జరగబోతోంది ?

ఫామ్ హౌస్ కేసులోసీబీఐ ఇప్పటికీ మౌనంగా ఉంటోంది. ఐదు సార్లు లేఖలు రాసినా తెలంగాణ సీఎస్ స్పందించకపోయినా పట్టించుకోవడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది ?

FOLLOW US: 
Share:

Where Is CBI:  సంచలనం సృష్టించించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సీబీఐ ఇంకా  చార్జ్ తీసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై సీబీఐకి ఎలాంటి ఆటంకాలు రాలేదు. అయినా ఈ విషయంలో సీబీఐ వీలైనంత వరకూ సైలెన్స్ పాటిస్తోంది. కేసుకు సంబంధించిన పత్రాలివ్వాలని లేఖలు రాయడం తప్ప ఏమీ చేయడం లేదు. సుప్రీంకోర్టులోనూ క్లారిటీ వచ్చిన తర్వాత దూకుడు చూపిద్దామని ఆగుతోందా ? లేకపోతే ఇతర కారణాలతో సైలెంట్ అవుతున్నారా? 

ఎన్ని సార్లు లేఖలు రాసినా సీబీఐకి ఫైళ్లు ఇవ్వని తెలంగాణ సీఎస్ 
 
ఎమ్మెల్యేల ఎర కేసు కు సంబంధించిన  ఫైళ్లను  సీబీఐకి వెనువెంటనే అంద జేయాలని హకోర్టు తీర్పు వెలువరించి పది రోజులు దాటింది. ఐదు సార్లు లేఖలు రాశామని సీబీఐ మీడియాకు లీకులిచ్చింది. కానీ ఫైల్స్ మాత్రం సీబీఐకి అందలేదు. అలాగని సీబీఐ ప్రత్యామ్నాయ మార్గాన్నీ చూసుకోలేదు. సైలెంట్ గా ఉండిపోయింది. నేరుగా బీజేపీ పెద్దలకు ముడి పెట్టేందుకు తెలంగాణ సిట్ చేసిన ప్రయత్నం  ఈ కేసులో ఉన్నందున సీబీఐ కూడా ... తాము అత్యుత్సాహం చూపించామన్న  అభిప్రాయం కలగకుండా ఇలా వీలైనంత వరకూ ... అన్ని అవకాశాలు పరిశీలిస్తోందన్న చర్చ జరుగుతోంది. 

17న సుప్రీంకోర్టులో విచారణ - ఆ తర్వాత సీబీఐ యాక్షన్ ? 

ఈ కేసు విషయంలో సీబీఐ విచారణపై స్టే తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై 17వ తేదీన క్లారిటీ వస్తుంది. ఆ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే ఇక సీబీఐ రంగంలోకి దిగాల్సిన పని ఉండదు. ఒక వేళ వాయిదా పడినా... ఎలాంటి ఆదేశాలు రాకపోయినా సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉంది.17వ తేదీ తర్వాత  ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయినా  నేరుగా కదన రంగంలోకి దిగాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైళ్ళతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని సీబీఐ ఢిల్లిలోని ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. - ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో దూకుడుగా వ్యవహరించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారని ఉన్నతాధికారులు న్యాయసలహాలు కూడా తీసుకున్నారని అంటున్నారు.  

మొదట ఎమ్మెల్యేల విచారణ ! 

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పైలట్‌ రోహత్‌ రెడ్డి(తాండూరు), గువ్వల బాలరాజు(అచ్చంపేట), బీరం #హర్షవర్దన్‌ రెడ్డి(కొల్లాపూర్‌), రేగా కాంతారావు(పినపాక)లు ప్రధానంగా ట్రాప్ చేశారు. వీరిని మొదటగా ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.  ప్రభుత్వం ఫైళ్లు ఇస్తే సరేసరి లేని పక్షంలో చివరి అస్త్రాన్ని ప్రయోగించాలన్న పట్టుదలతో సీబీఐ ఉన్నట్టు చెబుతున్నారు. 17వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేయాలన్న అంశంపై కూడా సీబీఐ సమాలోచనలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసు అటు  బీజేపీకి.. ఇటు బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే పదిహేడో తేదీ తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

Published at : 15 Feb 2023 07:47 AM (IST) Tags: CBI Case CBI Farm House Case MLA purchase case BRS Vs BJP

సంబంధిత కథనాలు

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Warangal Politics : సిట్టింగ్ లకే సీట్లైతే గులాబీ పార్టీలో ముసలం తప్పదా? ఓరుగల్లులో మారనున్న రాజకీయ సమీకరణాలు

Warangal Politics :  సిట్టింగ్ లకే సీట్లైతే గులాబీ పార్టీలో ముసలం తప్పదా?  ఓరుగల్లులో మారనున్న రాజకీయ సమీకరణాలు

Rahul Gandhi Issue : రాహుల్ గాంధీపై అనర్హతా వేటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా ? విపక్షాలన్నీ ఏకమవుతాయా ?

Rahul Gandhi Issue : రాహుల్ గాంధీపై అనర్హతా వేటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా ? విపక్షాలన్నీ ఏకమవుతాయా ?

AP Legislative Council : మండలిలో సంపూర్ణ ఆధిపత్యంపై తప్పిన వైఎస్ఆర్‌సీపీ లెక్క- ప్రతిపక్ష వాయిస్ గట్టిగానే వినిపిస్తుందా ?

AP Legislative Council :  మండలిలో సంపూర్ణ ఆధిపత్యంపై తప్పిన వైఎస్ఆర్‌సీపీ లెక్క- ప్రతిపక్ష వాయిస్ గట్టిగానే వినిపిస్తుందా ?

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే  

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!