MK Stalin BJP Alliance: స్టాలిన్ ఎన్డీయేలోకి? బీజేపీ 2/3 మెజారిటీ వ్యూహం.. కాంగ్రెస్‌కు డీఎంకే రివర్స్ షాక్ ఇస్తుందా?
DMK Joining NDA: కాంగ్రెస్ పై డీఎంకే రగిలిపోతోంది. ఇప్పుడు బీజేపీ ఈ పరిణామాల్ని తమకు అనుకూలంగా మల్చుకుంటోంది. డీఎంకేను ఎన్డీఏలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

BJP Two Thirds Majority Strategy: పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుపుతున్నాయని తమిళనాడులో విస్తృత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ - డీఎంకే మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న స్నేహం విడిపోవడం ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది.
ఢిల్లీ టూ చెన్నై - స్టాలిన్ ఎన్డీయేలోకి వస్తారా?
జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే మాటకు తగ్గట్లే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరవాత కాంగ్రెస్ కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా విజయ్ టీవీకేతో కలిసిపోయింది. ఇది స్టాలిన్ ను బాధించింది. అందుకే కాంగ్రెస్ వెన్నపోటు పొడిచిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాము ఇండీ కూటమిలోలేమని కూడా ప్రకటించారు. అందుకే ఇప్పుడు ఆయన కోసం ఎన్డీఏ ఎదురు చూస్తోంది.
2/3 మెజారిటీ – బీజేపీ అసలు వ్యూహం
పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు చేపట్టాలన్నా లే దా కీలక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించాలన్నా బీజేపీకి మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అత్యవసరం. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్డీయేకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, భారీ సంస్కరణల కోసం మరిన్ని పార్టీల మద్దతు అవసరం. ముఖ్యంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. ఒకవేళ డీఎంకే తన ఎంపీలతో ఎన్డీయేలోకి వస్తే, బీజేపీకి అప్రతిహతమైన బలం చేకూరుతుంది. ఇదే జరిగితే దక్షిణాదిలో బీజేపీకి ఒక బలమైన మిత్రపక్షం దొరికినట్లవుతుంది.
గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా డీఎంకే
అయితే, ఈ ప్రచారాన్ని కొందరు తోసిపుచ్చుతున్నారు. ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న డీఎంకే, హిందుత్వ వాదాన్ని వినిపించే బీజేపీతో కలవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం వంటి అంశాలపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో, ఈ రెండు పార్టీల కలయిక అసాధ్యమని కొందరి వాదన. కానీ, రాజకీయాల్లో అధికారం కోసం భావజాలాలను పక్కన పెట్టడం కొత్తేమీ కాదని, గతంలో కరుణానిధి కూడా వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇది సాధ్యమేనా?
ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, ఢిల్లీలో జరుగుతున్న అంతర్గత చర్చలు మాత్రం ఏదో పెద్ద మార్పు రాబోతోందని సూచిస్తున్నాయి. ఒకవేళ స్టాలిన్ నిజంగానే ఎన్డీయే గూటికి చేరితే, అది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అతిపెద్ద పవర్ షిఫ్ట్' అవుతుంది. ఇది కాంగ్రెస్‌ను ఒంటరిని చేయడమే కాకుండా, బీజేపీకి దేశవ్యాప్తంగా తిరుగులేని అధికారాన్ని కట్టబెడుతుందని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















