అన్వేషించండి

Donald Trump Buffalo Bangladesh: హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందని బర్రెకు ట్రంప్ పేరు పెట్టారు - బాగానే ఉంది కానీ బక్రీద్‌కు కోసుకు తినేస్తారట - బంగ్లాదేశ్‌ వాళ్లకు భయం లేదా?

Viral Albino Buffalo: బంగ్లాదేశ్‌లో డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్‌తో ఉన్న ఒక అరుదైన బర్రె వైరల్ అవుతోంది. బక్రీద్ సందర్భంగా బలి ఇవ్వడానికి దీన్ని రెడీ చేసేశారు.

Bangladesh Blond haired buffalo :    బంగ్లాదేశ్‌లో ఒక బర్రె ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దానికి ఉన్న వింతైన జుట్టు, ఆ జుట్టు స్టైల్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉండటంతో అందరూ దీనిని  డోనాల్డ్ ట్రంప్ బర్రె  అని పిలుస్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఈ బక్రీద్ కు దాన్ని కోసుకు తినేయడానికి ప్లాన్ చేయడమే విచిత్రంగామారింది. 

 బంగ్లాదేశ్  డోనాల్డ్ ట్రంప్ .. బర్రె రూపంలో సెన్సేషన్   
 
బంగ్లాదేశ్‌లోని నారాయణ్‌గంజ్‌లో ఒక అరుదైన అల్బినో రకం బర్రె ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సుమారు 700 కిలోల బరువున్న ఈ బర్రె తలపై ఉన్న బంగారు వర్ణపు  జుట్టు అచ్చం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్‌ను పోలి ఉంటుంది. దీంతో ఈ బర్రెకు యజమాని  డోనాల్డ్ ట్రంప్  అని నామకరణం చేశాడు.
 
ఈ బర్రె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దానిని చూడటానికి జనం బారులు తీరుతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి మరీ ఈ వింత బర్రెతో సెల్ఫీలు దిగుతున్నారు.  దీని జుట్టు స్టైల్ చూడగానే మా తమ్ముడు దీనికి డోనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఇది సెలబ్రిటీ అయిపోయింది అని యజమాని జియా ఉద్దీన్ మృధా సంతోషంగా చెబుతున్నారు.   

 
సాధారణ బర్రెల్లా కాకుండా, ఈ ట్రంప్ బర్రెకు చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎండ వేడిని తట్టుకోలేకపోయే ఈ అల్బినో బర్రెను రోజుకు నాలుగు సార్లు చల్లని నీటితో స్నానం చేయిస్తారు. దీని జుట్టును ప్రత్యేకమైన దువ్వెనతో దువ్వుతూ అందంగా తీర్చిదిద్దుతారు. అయితే, జనం తాకిడి పెరగడం, సెల్ఫీల గొడవతో ఈ బర్రె కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే ఇప్పుడు సందర్శకులపై ఆంక్షలు విధించామని యజమాని తెలిపారు.  

 ఈద్ త్యాగానికి సిద్ధం 


ఎంత పాపులారిటీ ఉన్నా, ఈ బర్రెను ఈద్-అల్-అధా (బక్రీద్) సందర్భంగా బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక కస్టమర్ దీనిని లైవ్ వెయిట్ ప్రాతిపదికన కిలో రూ. 550 చొప్పున  కొనుగోలు చేశారు.  నేను డోనాల్డ్ ట్రంప్‌ను చాలా మిస్ అవుతాను, కానీ త్యాగం చేయడమే ఈ పండుగ అసలు ఉద్దేశం  అని యజమాని భావోద్వేగంతో చెబుతున్నారు. 

అరుదైన జాతి 

సాధారణంగా బంగ్లాదేశ్‌లో నల్లటి బర్రెలు ఉంటాయి. కానీ, శరీరంలో మెలనిన్ లోపం వల్ల వచ్చే ఈ అల్బినో బర్రెలు తెల్లగా లేదా పింక్ రంగులో ఉంటాయి. ఇలాంటివి చాలా అరుదుగా పుడుతుంటాయి. ఈ 'ట్రంప్' బర్రెతో పాటు అదే ఫామ్ హౌస్‌లో నేమార్  అనే పేరు గల మరో ఎద్దు కూడా ఉండటం విశేషం. 

అమెరికా రాజకీయాల్లో ట్రంప్ ఒక సెన్సేషన్ అయితే, బంగ్లాదేశ్ పశువుల మార్కెట్‌లో ఈ బర్రె ఒక సంచలనం. తన వింతైన రూపంతో కొన్ని వారాల పాటు ఇంటర్నెట్‌ను ఊపేసిన ఈ 'దోనాల్డ్ ట్రంప్' బర్రె, ఈ పండుగ వేళ తన ప్రయాణాన్ని ముగించబోతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Elon Musk Net Worth 2026:తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Night Routine Habits : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
Suriya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Embed widget