అన్వేషించండి

Where is KCR : ఏం జరుగుతున్నా బయటకు రాని కేసీఆర్ - కవితకు బెయిల్ వచ్చిన తర్వాతనే తెర మీదకు వస్తారా ?

Telangana : భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఇటీవలి కాలంలో బయట కనిపించడం లేదు. పార్టీ నేతల్ని కలవడం లేదు. ఆయన ఎందుకు రాజకీయ ఆజ్ఞాతంలో ఉంటున్నారు ?

BRS chief KCR is not seen outside :  తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. రోజు రోజుకు కొత్త కొత్త కారణాలతో హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా వ్యవహారం దుమారం రేగుతోంది. అంతకు ముందు రుణమాఫీ విషయంలో కానీ.. ఆరు గ్యారంటీల విషయంలో కానీ బీఆర్ఎస్ లోని ఇతర నేతలు కాంగ్రెస్ సర్కార్ పై గట్టిగానే విరుచుకుపడుతున్నారు .  కానీ కమాండర్ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్  చేశారు. కనీసం అందులో అయినా తన స్పందన వ్యక్తం చేయడం లేదు. పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. దీంతో  ఇతర పార్టీల నేతల్లోనే కాదు.. బీఆర్‌ఎస్ నేతల్లోనూ ఎందుకిలా అన్న ప్రశ్న వస్తోంది. 

కవిత రిలీజయ్యే వరకూ  బయటకు రాకూడదని అనుకున్నారా ?

బిడ్డ కవిత ఢిల్లీ జైల్లో ఉందని.. బయటకు ఇలా కనిపిస్తున్నా.. తన గుండెల్లో అగ్నిపర్వతం  బద్దలవుతోందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన బయట కనిపించలేదు. కవిత అరెస్టు కావడం.. సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంచడం వల్ల కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని  బిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు ఆయన న్యాయపరమైన ఎన్నో ప్రయత్నాలు చేశారని అంటున్నారు. దేశంలోని టాప్ లాయర్లతో ఆయన మాట్లాడారని అంటున్నారు. ఈ అంశంపైనే  నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారని.. అందుకే ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తికరంగా లేరని చెబుతున్నారు. కవితకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాతనే ఆయన బయటకు వస్తారని అంచనా వేస్తున్నారు. 

పీ, తెలంగాణకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ - ఈ వారమే కేబినెట్ ఆమోదం కూడా!

రాజకీయాలు పూర్తిగా కేటీఆర్, హరీష్ కు అప్పగించినట్లేనా ?

రోజువారీ రాజకీయాలపై కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఆయన పార్టీ నేతలతో కూడా ఈ అంశాలపై మాట్లాడటం లేదని చెబుతున్నారు. రాజకీయ వ్యవహారాలు, వ్యూహాలను పూర్తిగా కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారని అంటున్నారు. అందుక కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలతో దాడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలాంంటి చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. అంగన్  వాడిల్లో పిల్లలకు ఇచ్చే గుడ్లు సరిగ్గా లేవని వస్తే.. దానిపైనా  కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల బీఆర్ెస్ చేసిన రాజకీయ పోరాటాలకు కేటీఆరే నేతృత్వం వహించారు.  కేసీఆర్ చిన్న స్పందన కూడా వ్యక్తం చేయలేదు. రుణమాఫీ అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అయినా కేసీఆర్ బయటకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ రాజీనామా

ఆరోగ్యం  బాగోలేదన్న ప్రచారం అందుకే !

సాధారణంగా కేసీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని  మరింత బలోపేతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా తెరపైకి వస్తారని ఎవరైనా ఊహిస్తారు. కానీ ఆయన రాకపోయే సరికి బహుశా ఆరోగ్యం  బాగోలేదేమో అనే ప్రచారం ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోతే సంచనలం అయ్యేది. కానీ అలాంటి పరిస్థితి లేదని కేసీఆర్ బయటకు వచ్చేలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారమని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ బయటకు వచ్చే వరకూ ఈ తరహా ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. మంగళవారం కవితకు బెయిల్ వస్తుందని  బీఆర్ఎస్ ఆశాభావంతో ఉంది. ఆ తర్వాతైనా కేసీఆర్ బయటకు వస్తారేమో చూడాలి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget