అన్వేషించండి

BRS Vs Kavitha: 2026లో బీఆర్ఎస్‌కు అతి పెద్ద సవాల్ కవితే - నాలుగైదు శాతం ఓట్లు చీల్చినా గండమే - కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

BRS: 2026లో బీఆర్ఎస్‌కు అతి పెద్ద సవాల్ గా కవిత నిలువనుననారు. ఆమె పార్టీ పెట్టి నాలుగైదు శాతం ఓట్లు చీల్చినా బీఆర్ఎస్ కు జరిగే నష్టం అంచనా వేయడం కష్టం. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

Biggest challenge for BRS in 2026: తెలంగాణ రాజకీయాల్లో 2026 సంవత్సరం సరికొత్త సమీకరణాలకు వేదిక కాబోతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ కంటే కూడా సొంత ఇంటి నుంచే వచ్చే ముప్పు అతి పెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమయింది.  

వెనక్కి తగ్గేది లేదంటూ పోరాటం చేస్తున్న కవిత 

తెలంగాణ ఉద్యమ కాలం నుండి తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక సారథిగా కవితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మహిళా గళంగా ఆమె కీలకంగా వ్యవహరించారు. కారణాలు ఏమైనా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె జాగృతి పేరుతో రాజకీయం  చేస్తున్నారు. కానీ ఇంకా రాజకీయ పార్టీగా ప్రకటించలేదు.  కొత్త ఏడాదిలో ఆమె సొంతంగా పార్టీని ప్రకటించి, మరింతగా క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్‌కు పరోక్షంగా పెనుగండంగా మారుతుంది. ఇది కేవలం రాజకీయ చీలిక మాత్రమే కాదు, కేసీఆర్ స్థాపించిన పార్టీకి నైతిక , సెంటిమెంట్ పరమైన దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉంది.
 
నాలుగైదు ఓట్ల శాతంతో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం

రాజకీయాల్లో 1 లేదా 2 శాతం ఓట్ల వ్యత్యాసమే అధికార మార్పిడికి కారణమవుతుంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం తేడా చాలా స్వల్పంగా ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా కనీసం  *4 నుండి 5 శాతం ఓట్లను  చీల్చగలిగితే, అది నేరుగా బీఆర్ఎస్ గెలిచే స్థానాలపై ప్రభావం చూపుతుంది. బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకులో మహిళలు, సాంస్కృతిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తారు.  కవితా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ ఓట్లు చీలిపోయి అల్టిమేట్‌గా కాంగ్రెస్ లేదా బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. 

 నేతల వలసలు, క్యాడర్ అయోమయం 

కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తే, బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆమె వైపు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆమెకు ఉన్న పట్టు పార్టీకి నష్టం కలిగించవచ్చు. క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక అయోమయానికి గురైతే, పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది. కేసీఆర్ ఇమేజ్‌ను నమ్ముకున్న కార్యకర్తలు, కుటుంబంలోనే చీలిక వస్తే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది.

 బీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గం 

కవితను తమ దారిలోకి తెచ్చుకోకపోతే లేదా ఆమెను పార్టీలో సముచిత స్థానంతో సంతృప్తి పరచకపోతే బీఆర్ఎస్ మనుగడకు  పెద్ద సమస్యగా మారుతుంది. పార్టీకి విఘాతం కలగకుండా ఉండాలంటే కుటుంబ సమన్వయం కంటే కూడా రాజకీయ సమన్వయం అత్యవసరం. ఆమెను దూరం పెట్టడం వల్ల వచ్చే నష్టం కంటే, ఆమెతో కలిసి ప్రయాణించడం వల్ల కలిగే లాభాలను పార్టీ అధిష్టానం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. 2026లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వాడుకుని పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‌కు, ఈ అంతర్గత సంక్షోభం అడ్డంకిగా మారవచ్చు. కవితా ఫ్యాక్టర్ కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో కేసీఆర్ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాల్సి ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget